ఐపీఎల్ ఫైనల్‌లో 'వార్ 2' కొత్త టీజర్ ఏది?
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసిన ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫినాలే గ్రౌండ్‌లో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, ఇంకా శాటిలైట్ ఛానల్‌లో కూడా వార్ 2 సెకండ్ టీజర్‌ను విడుదల చేయాలని భావించారు.
By: Tupaki Desk | 4 Jun 2025 2:40 PM ISTహృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ 2' ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీతో పాటు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న వార్ 2 నుంచి ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ బర్త్‌డే టీజర్ విడుదల తర్వాత వార్ 2 బజ్ తగ్గింది అనేది కొందరి అభిప్రాయం. ఎన్టీఆర్ లుక్‌ను కొందరు ట్రోల్ చేస్తే, కొందరు హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ ను పోల్చుతూ కామెంట్ చేశారు. వార్ 2 సినిమాకు ఉన్న బజ్ తగ్గింది అంటూ పలువురు కామెంట్ చేస్తున్న సమయంలో మేకర్స్ మరో టీజర్‌ను విడుదల చేయడం ద్వారా అంచనాలను మళ్లీ పెంచాలనే ఉద్దేశంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూసిన ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫినాలే గ్రౌండ్‌లో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, ఇంకా శాటిలైట్ ఛానల్‌లో కూడా వార్ 2 సెకండ్ టీజర్‌ను విడుదల చేయాలని భావించారు. అందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. భారీ మొత్తంలో ఖర్చు చేసి మరీ మేకర్స్ సినిమా టీజర్‌ను ప్రమోట్ చేయాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. చివరి నిమిషంలో అనుకున్న కారణంగా సెకండ్ టీజర్ రెడీ కాలేదట. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో టీజర్‌ను ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫినాలేలో స్ట్రీమింగ్ చేయలేక పోయారని తెలుస్తోంది. వార్ 2 సినిమా మొదటి టీజర్‌ను జియో హాట్ స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ బ్రేక్ సమయంలో వేశారు.
కొత్త టీజర్ కోసం వెయిట్ చేసిన అభిమానులకు పాత టీజరే కనిపించడంతో పెదవి విరిచారు. ఇదేం విడ్డూరం అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. ట్రోల్స్ ఎదుర్కొన్న ఆ టీజర్‌నే ఐపీఎల్ వంటి మెగా టోర్నీ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో వేయడం అనేది తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల వార్ 2 టీజర్‌ను స్ట్రీమింగ్ చేయడంతో సినిమాకు మంచి ప్రమోషన్ దక్కింది. అయితే కొత్త టీజర్‌తో వచ్చి ఉంటే వార్ 2 కి మరింతగా బజ్ క్రియేట్ అయ్యి ఉండేది అనేది పలువురి అభిప్రాయం. వార్ 2 సినిమా సెకండ్ టీజర్‌ను ఐపీఎల్ గ్రాండ్ ఫినాలేలో మిస్ అయ్యామని చాలా మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ మొదటి సారి హిందీ సినిమాలో నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ వార్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చివరి పాట చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. హృతిక్ రోషన్ గాయం కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ పాట షూటింగ్‌కు దర్శకుడు అయాన్ ముఖర్జీ రెడీ అయ్యాడట. హృతిక్ రోషన్ పూర్తిగా కోలుకోవడంతో సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబో పాట చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెలలో షూటింగ్‌కు గుమ్మడి కాయ కొడితే కచ్చితంగా ఆగస్టులో సినిమా విడుదల చేసే అవకాశం ఉంటుందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఆమె బికినీ షో సినిమా స్థాయిని పెంచుతుందని అంటున్నారు.
