ఈ మూవీలో ఎన్టీఆర్ ఫైట్స్ ఆ లెవల్లో?
తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ నెవ్వర్ బిఫోర్ గా ఉంటాయని, నెక్ట్స్ లెవల్ టేకింగ్ తో రక్తి కట్టిస్తాయని చెబుతున్నారు.
By: Tupaki Desk | 18 April 2025 9:30 PMమాస్‌ని పదే పదే థియేటర్లకు రప్పించేందుకు ఐటమ్ పాట ఎంత ముఖ్యమో, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా యాక్షన్ పార్ట్ అత్యంత కీలకం. కానీ రొటీన్ ఫైట్స్ తో అన్నిసార్లు మెప్పించడం కుదరదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలి. అలా చూపించడంలో సక్సెసయ్యారు గనుకే ధూమ్, క్రిష్ ఫ్రాంఛైజీలు అంత పెద్ద సక్సెసయ్యాయి. యాక్షన్ అడ్వెంచర్లకు ఎప్పుడూ ఆదరణ దక్కుతుందనడానికి ఇటీవలి బ్లాక్ బస్టర్లు పఠాన్, జవాన్ కూడా ఉదాహరణ.
ఇప్పుడు 'వార్ 2'లో హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో! చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మూవీపై దక్షిణాదిన ఆరాలు మొదలయ్యాయి. ఈ సినిమా ఈ ఏడాది దక్షిణాదిన మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా పాపులరవ్వడానికి ఫ్రాంఛైజీలోకి ఎన్టీఆర్ ప్రవేశం ఒక కారణం. అందుకే తారక్ ని తెరపై ఎలా చూపించబోతున్నారో చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ నెవ్వర్ బిఫోర్ గా ఉంటాయని, నెక్ట్స్ లెవల్ టేకింగ్ తో రక్తి కట్టిస్తాయని చెబుతున్నారు. బాలీవుడ్ స్టైల్ యాక్షన్ మేకింగ్ కి తారక్ పర్ఫెక్ట్ ఫిట్ అయ్యాడట. మునుపెన్నడూ చూడనంత కొత్తగా తారక్ ని చూస్తారు! అని చెబుతున్నారు. ఎన్టీఆర్ గత సినిమాల్లో యాక్షన్ వేరు.. ఈ సినిమాలో యాక్షన్ వేరు! అని లీక్ అందింది. తారక్ తన కెరీర్ లో అత్యంత స్టైలిష్ గా కనిపించబోతున్న మూవీ కూడా ఇదేనని చెబుతున్నారు.