Begin typing your search above and press return to search.

హీరో కాకున్నా ఎన్టీఆర్‌ ఆ రికార్డ్‌ క్రియేట్‌ చేసేనా?

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'దేవర' సినిమా మొదటి రోజు వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.140 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   18 July 2025 6:00 AM IST
హీరో కాకున్నా ఎన్టీఆర్‌ ఆ రికార్డ్‌ క్రియేట్‌ చేసేనా?
X

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'దేవర' సినిమా మొదటి రోజు వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.140 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అదే జోరు వీకెండ్‌ మొత్తం కొనసాగింది. ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడంకు కారణం సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నాగవంశీ సినిమాను పట్టుబట్టి అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా సినిమాకు అత్యధికంగా ప్రత్యేక షో లు వేయడం జరిగింది. విశ్వసనీయంగా అప్పుడు అందిన సమాచారం ప్రకారం దేవర సినిమాకు ఏకంగా 550 ప్రత్యేక షో లను నాగవంశీ వేయించాడు. అందుకే అత్యధిక ఫస్ట్‌ డే కలెక్షన్స్ నమోదు అయ్యాయి అనేది టాలీవుడ్‌, బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల వారి అభిప్రాయం.

దేవర సినిమాకు అనుసరించిన విధానంను ప్రస్తుతం వార్‌ 2 సినిమాకు అనుసరించాలని నిర్మాత నాగవంశీ ప్లాన్‌ చేస్తున్నాడట. వార్‌ 2 సినిమాను నాగవంశీ భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు. ఆయన ఈ సినిమాపై నమ్మకంతో భారీ మొత్తానికి కొనుగోలు చేశాడు. సినిమా టీజర్‌ విడుదల తర్వాత బజ్‌ తగ్గింది. దాంతో రేట్లు కూడా తగ్గుతాయి అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా అత్యధిక మొత్తానికి అమ్ముడు పోయింది. తెలుగులో ఈ సినిమా దాదాపుగా రూ.80 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం అందుతోంది. నాగవంశీ ఈ సినిమాను ఒక డైరెక్ట్‌ తెలుగు సినిమా రేంజ్‌లో విడుదల చేయాలని చాలా పట్టుదలతో కనిపిస్తూ, థియేటర్లను బుక్‌ చేశాడు.

ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ అంత రేటు పలకడానికి కారణం ఎన్టీఆర్‌ అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్న వార్‌ 2 సినిమాపై మొదటి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఎన్టీఆర్‌ హీరో కాదు, నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగినప్పటికీ వార్‌ 2పై చాలా ఆసక్తిని అభిమానులు చూపిస్తూ వస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో దేవర స్థాయి ఓపెనింగ్స్ నమోదు అవుతాయని, అంతకు మించి కూడా వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. ఎన్టీఆర్‌ ఈ సినిమాలో హీరో కాకున్నా ఆ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఆయన హీరో కాకున్నా కూడా వార్‌ 2 ను చూసేందుకు అభిమానులతో పాటు రెగ్యులర్‌ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది అంటున్నారు. ఒక తెలుగు హీరో నటించిన మొదటి స్పై థ్రిల్లర్ మూవీ ఇదే కావడంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను తాకేలా ఈ సినిమా ఉందా అనేది విడుదలైన తర్వాత క్లారిటీ వచ్చేను. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ముఖ్య పాత్రలో నటించగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించాడు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మాణం జరిగింది.