Begin typing your search above and press return to search.

వార్2 స్పెష‌ల్ సాంగ్ వ‌చ్చేద‌ప్పుడే

టాలీవుడ్, బాలీవుడ్ లోని ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ క‌నిపిస్తే ఎలా ఉంటుందో చూపించ‌డానికి వార్2 సినిమా రెడీ అవుతోంది.

By:  Tupaki Desk   |   19 July 2025 11:11 AM IST
వార్2 స్పెష‌ల్ సాంగ్ వ‌చ్చేద‌ప్పుడే
X

టాలీవుడ్, బాలీవుడ్ లోని ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ క‌నిపిస్తే ఎలా ఉంటుందో చూపించ‌డానికి వార్2 సినిమా రెడీ అవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇది. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో పాటూ ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండ‌టంతో వార్2 పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోకుండా డైరెక్ట‌ర్ అయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ‌వ‌గా దానికి ఆడియ‌న్స్ నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అప్ప‌టివ‌ర‌కు వార్2 పై ఉన్న అంచ‌నాల‌ను ఆ టీజ‌ర్ కు మ‌రింత పెంచింది. అంతేకాదు, ఈ సినిమా లో ఎన్టీఆర్, హృతిక్ క‌లిసి ఓ సాంగ్ లో స్టెప్పులు కూడా వేయ‌నున్నార‌నే విష‌యం తెలిసిందే.

అటు హృతిక్, ఇటు ఎన్టీఆర్ ఇద్ద‌రూ మంచి డ్యాన్స‌ర్లు కావ‌డంతో వీరిద్ద‌రూ క‌లిసి చేసే సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. య‌ష్ రాజ్ స్టూడియోస్ లో వేసిన స్పెష‌ల్ సెట్ లో ఇప్ప‌టికే ఈ సాంగ్ ను షూట్ చేయ‌గా త్వ‌ర‌లోనే ఈ సినిమా నుంచి ఆ స్పెష‌ల్ సాంగ్ రిలీజ్ చేసి, ఆ త‌ర్వాత ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లొచ్చాయి.

కానీ తాజా స‌స‌మాచారం ప్ర‌కారం వార్2 లోని స్పెష‌ల్ సాంగ్ లేట్ గా రిలీజ‌వనున్న‌ట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు కేవ‌లం వారం రోజుల ముందు మాత్ర‌మే ఈ పాట రిలీజ్ కానుంద‌ట‌. ముందుగా ట్రైల‌ర్ ను రిలీజ్ చేసి సినిమాకు ఉన్న హైప్ ను ఇంకాస్త పెంచి, ఆ త‌ర్వాత స‌రిగ్గా వారం రోజుల ముందు స్పెష‌ల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేసి అప్పుడు సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఆకాశాన్ని అంటించడానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.