'వార్ -2' ప్లానింగ్ స్ట్రాటజీ పోలే అదిరిపోలే!
హృతిక్ రోషన్- ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న `వార్ -2` భారీ అంచనాల మధ్య ఆగస్టు 14 న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 July 2025 4:00 PM ISTహృతిక్ రోషన్- ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న `వార్ -2` భారీ అంచనాల మధ్య ఆగస్టు 14 న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం తారక్-హృతిక్ పై ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. సినిమాలో ఈ పాట పీక్స్ లో ఉండబోతుంది. ఈ పాటపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఆ సంగతి పక్కనబెడితే ఈ సినిమా ప్రచారం విషయంలో మేకర్స్ స్ట్రాటజీ మూములుగా లేదు.
ఓ సరికొత్త స్ట్రాటజీతో సినిమాని జనాల్లోకి బలంగా తీసుకెళ్లే రచన సిద్దం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హృతిక్ -తారక్ వేర్వేరుగా ప్రమెట్ చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇద్దరు ఏ సందర్భంలోనూ ఒకే వేదికను పంచుకోరు. ఎవరికి వారు స్వతంత్రంగా చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్తారు. అంటే బాలీవుడ్ ప్రమోషన్ పూర్తిగా హృతిక్ చేతుల్లో ఉంటే టాలీవుడ్ వరకూ పూర్తి బాధ్యతలు తారక్ తీసుకుంటాడు.
రెండు చోట్లా వేర్వేరు ఈవెంట్లు జరుగుతాయి. బాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండవు. కానీ తెలుగులో అవి తప్పనిసరి. కాబట్టి వార్ 2 కి సంబంధించి బిగ్గెస్ట్ ఈవెంట్ హైదరాబాద్ లో ఉంటుంది. అందులో తారక్ మాత్రమే హైలైట్ అవుతాడు. హృతిక్ రోషన్ పాల్గొనే అవకాశం లేదు. అంటే వార్ 2 చిత్రాన్ని ఓ తెలుగు సినిమాలా రిలీజ్ చేస్తున్నట్లు ఓ కొత్త స్ట్రాటజీ లెక్కలో వెళ్తున్నట్లు.
ఇలా ప్రచారం చేస్తే తెలుగు ఆడియన్స్ దీన్నో హిందీ చిత్రంగా భావించారన్నది మేకర్స్ ఆలోచన అయిం డొచ్చు. కలిసి కనీసం ప్రమోషనల్ వీడియో కూడా చేయరంట. నీ ప్రచారం నీదే...నా ప్రచారం నాదే అన్న తీరున వ్యవహరిస్తారని లీకులను బట్టి తెలుస్తోంది. ఈ రకమైన ప్రచారం సినిమాకు బాగా కలిసొస్తుంది. మార్కెట్ పరంగానూ బాగా వర్కౌట్ అవుతుంది.
