Begin typing your search above and press return to search.

వార్ 2 ముందున్న సవాళ్ళు.. అంత ఈజీ కాదు..

ఇండియన్ యాక్షన్ యూనివర్స్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ ‘వార్ 2’. హృతిక్ రోషన్‌, జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌కు ఇదే తొలి సినిమా కావడం, బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోలు స్క్రీన్‌ షేర్ చేసుకోవడం వంటి అంశాలు భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 May 2025 9:30 PM
War 2 Updates
X

ఇండియన్ యాక్షన్ యూనివర్స్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ ‘వార్ 2’. హృతిక్ రోషన్‌, జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌కు ఇదే తొలి సినిమా కావడం, బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోలు స్క్రీన్‌ షేర్ చేసుకోవడం వంటి అంశాలు భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలవ్వకపోవడంతో ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి అయితే ఉంది. ఇదే విషయమే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది.

హృతిక్ గాయం కారణంగా తీసుకున్న విరామం ఈ సినిమాకు పెద్దగా అడ్డంకిగా మారింది. తారక్, హృతిక్ కాంబినేషన్‌లో చిత్రీకరించాల్సిన పాటలు ఇంకా మిగిలివుండడంతో మొత్తం షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. టీజర్ అప్డేట్ విషయం పక్కన పెడితే.. అసలు ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా వదిలుంటే ఓ లెవెల్ బజ్ వచ్చేది. కానీ డెడ్ లైన్ దగ్గరపడుతున్నా ఈ విషయంలో యష్ రాజ్ ఫిలింస్ అలసత్వం చూపుతోంది.

ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరూ కలిపి ఎదురు చూస్తున్న సమయంలో ఎలాంటి అప్డేట్ రివీల్ చేయకపోవడం వింతగా మారుతోంది. ఇదిలా ఉండగా, వార్ 2 తెలుగు, తమిళ వర్షన్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పలు టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇప్పటికే భారీ బిడ్లు వేస్తున్నాయని సమాచారం. అయితే యష్ రాజ్ బేనర్ మాత్రం ఇప్పట్లో డీల్స్ క్లోస్ చేయడం లేదట. సరిగ్గా టీజర్ రిలీజ్ టైమ్ దగ్గరే రెస్పాన్స్ బేస్‌డ్ వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తున్నారు.

ఇది పాజిటివ్‌ స్ట్రాటజీ అయినప్పటికీ, ప్రస్తుతం పోటీ బాగా పెరిగిపోవడం వల్ల మరింత ఒత్తిడి పడుతోంది. అదే సమయంలో రజనీకాంత్ ‘కూలి’ పోస్ట్ ప్రొడక్షన్ పుల్ స్పీడ్‌లో జరుగుతోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, టీజర్ బ్లాస్ట్ చేసింది. రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయింది. ఇది వార్ 2 టీంకు ఎదురులేని మెసేజ్‌లాంటిది. రెడీ కావడంలో కూలి ముందుండటం నిజంగానే ఆందోళనకరం..

వార్ 2 రిలీజ్ డేట్ మాత్రం మార్చే ప్రసక్తే లేదని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ చివరినుండి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని యష్ రాజ్ ప్రణాళిక వేసింది. రాజమౌళి తరహాలో దేశం చుట్టే ప్రమోషన్లు జరపాలని చూస్తున్నారు. ప్రత్యేకంగా తారక్‌కు కూడా బ్రేక్ ఇచ్చి ఆ ప్రచారాల్లో భాగం అయ్యేలా ప్లాన్ ఉంది. ఐతే ఓ విషయం క్లియర్.. ఈ సినిమాలో బహుశా ఎలాంటి స్పెషల్ క్యామియోలు ఉండబోవు. మొదటి నుంచే దాగుడుమూతల మధ్య సాగిన ప్రచారానికి ఈ క్లారిటీ కొంతవరకు నిరాశ కలిగించే అంశం కావచ్చు. మొత్తానికి క్రేజ్ ఉన్నా.. కంటెంట్ గురించి క్లారిటీ లేకపోవడం, ప్రమోషన్ ఆలస్యం, బిజినెస్ డీల్స్ మళ్లింపులు అన్నీ కలిపి వార్ 2 యూనిట్‌ను గట్టిగా పరీక్షిస్తున్నాయి. మరి ఈ చాలెంజ్ లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.