Begin typing your search above and press return to search.

టైగ‌ర్ డాన్స్ కు హృతిక్ సైతం ఫిదా!

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్..టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో `వార్ 2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 July 2025 3:48 PM IST
టైగ‌ర్ డాన్స్ కు హృతిక్ సైతం ఫిదా!
X

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్..టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో `వార్ 2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టాకీ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం తార‌క్-హృతిక్ మ‌ధ్య ఓ పాట చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట ఎలా ఉంటుందో? అంచ‌నాలు ఇప్ప‌టికే పీక్స్ కు చేరాయి. నాటు నాటు రేంజ్ లో ఇద్ద‌రు పోటీ ప‌డే పాట‌గా హైలైట్ అవుతుంది. ఈపాట కోసం ఇద్ద‌రు క‌లిసి రిహార్స‌ల్స్ చేసారు. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన పీడ్ బ్యాక్ బ‌య‌ట‌కు వ‌స్తోంది.

ఈ పాట‌లో తార‌క్ డాన్స్ చూసి హృతిక్ ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయాడుట‌. తార‌క్ డాన్స్ మూవ్ మెంట్స్ చూసి హృతిక్ కూడా ఫిదా అయ్యాడుట‌. ఆన్ సెట్స్ లో ఈ పాట‌ను లైవ్ లో వీక్షించిన వారు ఓ అగ్ని గా పేర్కొంటున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య డాన్స్ పోరు అగ్ని వ‌ర్షం కురిసిన‌ట్లే ఉందిట‌. ఇద్ద‌రు ఎంతో పోటా పోటీగా క‌లిసి ప‌ని చేసిన‌ట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ ఎన‌ర్జీ , గ్రేస్ ,పవర్-ప్యాక్డ్ డ్యాన్స్ స్టెప్స్ తో వావ్ అనిపించేలా చేసాడంటున్నారు.

హృతిక్ లాంటి డాన్సు దిగ్గ‌జంతోనే ప్ర‌శంస అంటే చిన్న విష‌య‌మా? సెట్‌లో ఎన్టీఆర్‌ను ప్రశంసిస్తూ, అతని కదలికలు అద్భుతంగా ఉన్నాయని హృతిక్ అన్నాడుట‌. అభిమానుల‌కు ఈ పాట గొప్ప విజువ‌ల్ ట్రీట్ గా నిలుస్తుందంటున్నారు. ఇప్ప‌టికే ఈ పాట చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. దాదాపు వారం రోజుల పాటు చిత్రీక‌రించారు. ఈ పాట కోసం య‌శ్ రాజ్ స్టూడియోలో ప్ర‌త్యేకంగా కోట్లాది రూపాయ‌లు వెచ్చించి భారీ సెట్ వేసారు.

అందులోనే పాట చిత్రీక‌రించారు. ఇందులో తార‌క్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. హీరో పాత్ర‌కు ధీటుగా ఈ రోల్ ఉంటుంది. ఇద్ద‌రి మ‌ధ్య దెబ్బ‌లాట హైలైట్ గా ఉంటుంద‌ని నిర్మాత నాగ‌వంశీ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సీన్ చూసే సినిమా రైట్స్ తాను తీసుకున్న‌ట్లు రివీల్ చేసారు. భారీ ఎత్తున సినిమా ఆగ‌స్టులో రిలీజ్ అవుతుంది. ఆగ‌స్టు తొలివారం నుంచే ప్రచారం ప‌నులు మొద‌ల‌వుతాయి.