Begin typing your search above and press return to search.

వార్ 2 బాక్సాఫీస్: ఓపెనింగ్ ఏ రేంజ్ లో ఉండొచ్చు?

హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న వార్ 2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   10 Jun 2025 9:00 PM IST
వార్ 2 బాక్సాఫీస్: ఓపెనింగ్ ఏ రేంజ్ లో ఉండొచ్చు?
X

హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న వార్ 2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. స్పై యూనివర్స్‌లో మోస్ట్ క్రేజీ మల్టీస్టారర్‌గా నిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు యాష్ రాజ్ ఫిల్మ్స్ ఏకంగా ఇండిపెండెన్స్ డే రిలీజ్‌గా ప్లాన్ చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఓ రికార్డ్ షురూ ఖాయంగా కనిపిస్తోంది. 2019లో వచ్చిన తొలి వార్ చిత్రం భారీ వసూళ్లతో హృతిక్ కెరీర్‌లో టాప్ ఓపెనింగ్‌ను రిపీట్ చేయగా, ఇప్పుడు ఎన్టీఆర్ జోడవ్వడం సినిమాకు ఓ క్రేజీ టర్నింగ్ పాయింట్ అయింది.

ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. హృతిక్‌కు బాలీవుడ్‌లో ఉన్న మాస్ ఫాలోయింగ్‌తో కలిపితే వార్ 2కి హిందీ బాక్సాఫీస్‌పై చెరగని ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం థియేట్రికల్ ప్రీ బిజినెస్, టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వేగం చూస్తే, ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ లో ప్రచారం.

తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్ 2 హక్కులకు మంచి డిమాండ్ నెలకొంది. ఎన్టీఆర్ ఫ్యాక్టర్ వల్లే ఈసారి హిందీ సినిమాకి తెలుగులోనూ డీల్ భారీగానే ఉండబోతోంది. ఇప్పటికే పలువురు బయ్యర్లు పోటీగా దరఖాస్తు చేసుకుంటుండగా, రైట్స్ కోసం కొంతమంది ముందుగానే అడ్వాన్స్ చెల్లించి నిలబడి ఉన్నట్టు టాక్. అయితే తొలిసారి హృతిక్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మాస్ బయ్యర్లు దీనిని పెద్ద బిజినెస్‌గా చూస్తున్నారు.

ఇక ఓపెనింగ్ వీకెండ్ రేసులో టాప్ సినిమాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (హిందీ వర్షన్) 185 కోట్లు

షారుక్ ఖాన్ జవాన్ 175 కోట్లు,

రణబీర్ కపూర్ యానిమాల్ 168 కోట్లు

ఈ ముగ్గురినీ ఓవర్‌టేక్ చేయాలంటే వార్ 2కి కంటెంట్ పరంగా కూడా అదే స్థాయిలో డెలివరీ ఇవ్వాలి. ట్రైలర్ తో బజ్ పెరిగితే ఓపెనింగ్ వీకెండ్ లో ఈ సినిమా హిందీలో 200 కోట్లు దాటే అవకాశం ఉంది. హృతిక్ యాక్షన్ స్టైల్, ఎన్టీఆర్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసొస్తే సాధ్యమేనని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. వీటితో పాటు ఈ చిత్రానికి హిందీలో భారీ థియేటర్లు లభించే అవకాశం ఉంది. కూలీ పోటీగా ఉన్నా కూడా వార్ 2కి ఉన్న క్రేజ్ వేరు. భారీ స్కేలు వీవీఎఫ్‌ఎక్స్ వర్క్, స్పై యూనివర్స్‌లో అడ్వాన్స్‌డ్ స్టోరీలైన్ అన్నీ కలిపి వార్ 2ను ఓ భారీ బ్లాక్‌బస్టర్‌గా మలిచే అవకాశాలున్నాయి.

మరోవైపు, హిందీలో హృతిక్‌ని సపోర్ట్ చేసే క్యాస్టింగ్, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానుల మద్దతు ఉండటంతో ఈ సినిమాకు నార్త్ సౌత్ మార్కెట్ నుండి రెడీగా రెస్పాన్స్ వచ్చే ఛాన్సుంది. ఒకవేళ ఈ సినిమా అంచనాలకు అనుగుణంగా హిట్ అయితే, ఎన్టీఆర్ బాలీవుడ్‌లో తన స్థానం పక్కాగా సెట్ చేసుకుంటాడు. హృతిక్ కూడా తన పాత గ్లామర్‌ను తిరిగి సాధిస్తాడు. ఈ సినిమా విజయం తర్వాత స్పై యూనివర్స్ కథానాయకుడిగా ఎన్టీఆర్‌కు కొత్త అవకాశాలు కూడా రావచ్చన్న ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఆడియెన్స్ అంచనాలను ఈ మల్టీస్టారర్ మూవీ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.