Begin typing your search above and press return to search.

తారక్ 'వార్ 2'.. ఆ రూట్లో ఫస్ట్ ఇండియన్ మూవీ

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ వార్-2.

By:  Tupaki Desk   |   25 July 2025 12:13 PM IST
తారక్ వార్ 2..  ఆ రూట్లో ఫస్ట్ ఇండియన్ మూవీ
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ వార్-2. స్పై జోనర్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాతోనే తారక్.. బీ టౌన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో సినీ ప్రియులు, అభిమానులు.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్-2ను భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీతోపాటు తమిళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు వార్-2 మేకర్స్.

అయితే రిలీజ్ కు ముందే వార్-2 మూవీ అరుదైన ఘనత సాధించింది. క్రేజీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దేశవ్యాప్తంగా సినిమా డాల్బీ అట్మోస్ లో రిలీజ్ కానుంది. దీంతో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న తొలి ఇండియన్ డాల్బీ సినిమాగా వార్-2 నిలవనుంది. అందుకు గాను ఇప్పటికే మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆడియన్స్ కు స్పెషల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో సినీ ప్రియులు, అభిమానులు.. డాల్బీ అట్మోస్ సౌండ్ ను ఫుల్ ఎంజాయ్ చేయనున్నారని తెలిపారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్-2 కొత్త శకానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు మేకర్స్.

విదేశాల్లో కూడా అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మోస్‌ షోలను ప్రదర్శించనున్న చిత్రంగా వార్‌ 2 నిలవనుందని తెలిపారు మేకర్స్. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ.. మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పవర్ ప్యాక్డ్ గా ఉన్న గ్లింప్స్.. అందరినీ ఆకట్టుకుని సోషల్ మీడియాలో అలరిస్తోంది.

అదే సమయంలో ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. తెలుగులో ఓ భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి.. మరింత బజ్ క్రియేట్ చేయనున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని వినికిడి. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.