Begin typing your search above and press return to search.

తార‌క్- హృతిక్ మ‌ధ్య అస‌లైన వార్ నేటి నుంచే!

'వార్ -2' లో హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మధ్య నాటు నాటు రేంజ్ ఓ భారీ సాంగ్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 July 2025 3:21 PM IST
తార‌క్- హృతిక్ మ‌ధ్య అస‌లైన వార్ నేటి నుంచే!
X

'వార్ -2' లో హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మధ్య నాటు నాటు రేంజ్ ఓ భారీ సాంగ్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు మంచి డాన్స‌ర్లు కావ‌డంతో పాట‌లో ఇద్ద‌రి మ‌ధ్య పోటీ త‌గ్గాఫ్ వార్ గా ఉంటుం ది. సినిమా ఎలా ఉన్నా? ఈ ఒక్క పాట పీక్స్ లో ఉంటుంది? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పాట కోసం థియేట‌ర్ కు వె ళ్లే అభిమానులెంతో మంది. ఇద్ద‌రి మ‌ధ్య ఆ ఇమేజ్ ను గుర్తించే మేక‌ర్స్ ఇలా ప్లాన్ చేసారు.

ఈ పాట కోసం ఇద్ద‌రు అదే రేంజ్ లో శ్ర‌మించారు. కొన్ని రోజుల పాటు య‌శ్ రాజ్ స్టూడియోలో రిహార్స‌ల్స్ కూడా జ‌రిగాయి. స్టెప్స్ ఎక్క‌డా నాన్ సింక్ కాకుండా ఈ రిహార్స‌ల్స్ జ‌రిగాయి. అంతా ప‌ర్పెక్ష‌న్ తో నేడు కెమెరా ముందుకెళ్లారు. ఈ పాట కు సంబంధించిన షూట్ మంగ‌ళ‌వారం మొద‌లైంది. ఇద్ద‌రి మ‌ధ్య సాంగ్ కాబ‌ట్టి పూర్తి చేయ‌డానికి వారం రోజులైనా స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌ట్లో నాటు నాటు పాట‌కు కూడా కొరియోగ్రాఫ‌ర్లు ఎక్కువ‌గానే స‌మ‌యం తీసుకున్నారు.

మ‌రి తార‌క్-హృతిక్ పాట‌కు ఎవ‌రు కంపోజ్ చేస్తున్నారు? అన్న‌ది తెలియాలి. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ గోప్యం గా ఉంచారు. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేస్తున్నారు. ప్రీత‌మ్-సంచిత్ బ‌ల్హోత్రా-అకింత్ బ‌ల్హోత్రా త్ర‌యం సంగీతం స‌మ‌కూ ర్చుతున్నారు. బాలీవుడ్ లో ముగ్గురు ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు. ఇప్ప‌టికే ఎన్నో మ్యూజిక‌ల్ హిట్స్ అందించారు. మ‌రి వార్ -2 లో ఈ స్పెష‌ల్ సాంగ్ కి ఎలాంటి సంగీతం అందించారో చూడాలి.

ఇప్ప‌టికే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తార‌క్ డ్రాగ‌న్ షూటింగ్ మొద‌లు పెట్టాడు. మ‌ళ్లీ పాట చిత్రీక‌ర‌ణ నేప‌థ్యంలో కొన్ని రోజుల పాటు ముంబైలో ఉంటాడు. అనంత‌రం డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పే అవ‌కాశం ఉంది. తార‌క్ కి హిందీ బాగా వ‌చ్చిన న‌టుడు. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 14న రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.