వార్ 2: ఎన్టీఆర్ కంటే హృతిక్ ఫీజు తక్కువ?
ఇదిలా ఉంటే, అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇందులో నటించిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సహా ఇతర స్టార్లు అత్యంత భారీ పారితోషికాలు అందుకుంటున్నారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 1 Jun 2025 10:00 PM ISTఎన్టీఆర్ - హృతిక్ నటించిన `వార్ 2` మోస్ట్ అవైటెడ్ కేటగిరీలో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. యష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో ఈ టీజర్ ఒక సెక్షన్ ప్రేక్షకుల్లో మెప్పు పొందినా కానీ, రొటీన్ విజువల్స్ నిరాశపరిచాయంటూ క్రిటిక్స్ విమర్శించారు. మునుపెన్నడూ చూడని విజువల్స్ ని చూపించే ప్రయత్నం కాదని పెదవి విరిచేసారు. ధూమ్, రేస్ లేదా క్రిష్ తరహా సన్నివేశాలను రిపీట్ చేస్తే, అది కొత్తదనాన్ని ఇవ్వదని అభిప్రాయం వ్యక్తమైంది.
ఇదిలా ఉంటే, అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇందులో నటించిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సహా ఇతర స్టార్లు అత్యంత భారీ పారితోషికాలు అందుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. అతడు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆరంగేట్రం చేస్తున్నాడు. హృతిక్ తో నువ్వా నేనా? అంటూ పోటీపడే పాత్రలో నటిస్తున్న తారక్ ఆరంగేట్రమే రూ. 60 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని కథనాలొస్తున్నాయి. గూఢచారి విశ్వంలో ఇది క్రేజీ సినిమా అంటూ యష్ రాజ్ సంస్థ హైప్ క్రియేట్ చేస్తోంది. కోయిమోయ్ వెబ్ సైట్ కథనం ప్రకారం.. ఎన్టీఆర్ రూ. 60 కోట్లు అందుకుంటున్నాడని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ కోసం రూ. 45 కోట్లు అందుకోగా, ఇప్పుడు దానిని మించిన పారితోషికం తారక్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. నిజానికి అతడు ఒక్కో సినిమాకి 30 కోట్ల రేంజులో పారితోషికం అందుకునేవాడు, కానీ ఆర్.ఆర్.ఆర్ తర్వాత పారితోషికం పెంచాడని గుసగుసలు వినిపించాయి.
అంతేకాదు, వార్ 2 మెయిన్ లీడ్ హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కంటే తక్కువ పారితోషికం అందుతోందని కొయిమోయ్ తన కథనంలో పేర్కొంది. మేజర్ కబీర్ ధాలివాల్ (స్పై ఏజెంట్) గా అతడు తిరిగి నటిస్తున్నాడు. 2019 వార్ లో పాత్రకు కొనసాగింపు ఇది. వార్ 2 కోసం హృతిక్ రోషన్ పారితోషికం రూ. 48 కోట్లుగా నిర్ణయించారని సమాచారం. యష్ రాజ్ ఫిల్మ్స్ అతడితో ఇప్పటికే పలు చిత్రాల్ని నిర్మించింది. కానీ గతంలో కంటే ఎక్కువ పారితోషికం అందిస్తోందని తెలుస్తోంది.
వార్ 2 టీజర్‌లో బికినీలో ఛమక్కున మెరిసింది కియారా అద్వానీకి భారీ పారితోషికం ముడుతోందని సమాచారం. కియరా తన కెరీర్ బెస్ట్ పారితోషికం అందుకుంటోందని సమాచారం. కియరాకు ఈ పాత్ర కోసం యష్ రాజ్ ఫిలింస్ 15 కోట్లు చెల్లిస్తోందని తెలిసింది. కియరా ఈ చిత్రంలో ఏజెంట్ కబీర్ కి లవర్ గా నటించింది. వార్ 2 ఆగస్టు 14న తెలుగు- హిందీ సహా పలు భాషల్లో విడుదల కానుంది.
