తారక్-హృతిక్ పాట కోసం అంత పెడుతున్నారా?
ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆశ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. మరి ఈ పాట కోసం యశ్ రాజ్ ఫిలింస్ ఎంత ఖర్చు చేస్తుందంటే? భారీ మొత్తంలోనే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 4 July 2025 3:00 PM IST`వార్ -2` లో హృతిక్ రోషన్-తారక్ మధ్య ఓ భారీ సాంగ్ షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై లో యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. డాన్స్ పరంగా ఇద్దరి మధ్య పోటా పోటీగా ఈ పాట ఉంటుంది. ఇద్దరు డాన్సులో ఎక్స్ పర్ట్ లు. తారక్ కన్నా హృతిక్ సీనియర్ అయినా? తారక్ చాలా వేగంగా డాన్సులో ఎదిగాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. దీంతో హృతిక్ తో పోటీ పడి తారక్ డాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడందరి దృష్టి ఈ పాటపైనే ఉంటుంది. ఎవరెంత బాగా డాన్సు చేస్తారు? అన్న చర్చే జరుగుతోంది.
ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆశ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. మరి ఈ పాట కోసం యశ్ రాజ్ ఫిలింస్ ఎంత ఖర్చు చేస్తుందంటే? భారీ మొత్తంలోనే కనిపిస్తుంది. అక్షరాలా 15 కోట్ల రూపాయ లు ఈ ఒక్క పాట కోసమే ఖర్చు చేస్తున్నారు. పాటకు సంబంధించిన సెట్ పనులు..ఇతర షూటింగ్ మొత్తం పూర్తి చేయడానికి 15 కోట్లు అవుతుందిట. పాట చిత్రీకరణ వారం రోజులకు పైగానే ఉంటుందని ప్రచారంలో ఉంది. వారం దాటితే మాత్రం బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 15 కోట్లు గాక అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
బడ్జెట్ లో యశ్ రాజ్ ఫిలింస్ ఎక్కడా తగ్గే సంస్థ కాదు. నాణ్యత కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంది. యశ్ రాజ్ ఫిలింస్ అంటే ఇండియాలోనే ఓ బ్రాండ్ నిర్మాణ సంస్థ. పైగా తారక్-హృతిక్ మధ్య పాట అంటే చిన్న విషయమా? ఈ సినిమా కోసం తారక్ కి భారీ మొత్తంలో పారితోషికం చెల్లించారు. అమౌంట్ ఎంత అన్నది బయటకు రాలేదు కానీ తారక్ అందుకున్న భారీ పారితోషికం ఇదే అవుతుందనే చర్చజరుగు తోంది. ఎందుకంటే ఈ పాత్ర కోసం తారక్ ని ఒప్పించడం చిన్న విషయం కాదు.
ప్రతి నాయకుడి రోల్ కాబట్టి తారక్ డిమాండ్ కూడా భారీగానే ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ పాటకు సంబంధించి తారక్-హృతిక్ ప్రత్యేకంగా రిహార్సల్స్ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు యశ్ రాజ్ స్టూడియోలోనే ఈ ప్రక్రియ కొనసాగింది. అంతా పర్పెక్ట్ గా ఒకే అనుకున్న తర్వాత టీమ్ సెట్స్ కు వెళ్లింది. అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.