వార్-2 వసూళ్లు ఎలా ఉన్నాయి?
కాగా.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వార్ 2 సినిమాకు రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ఇప్పటికే ట్రేడ్ పండితులు అంచనా వేశారు.
By: Tupaki Desk | 23 Aug 2025 8:35 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో రూపొందిన వార్-2 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా 2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం, ప్రమోషన్ ఖర్చులు సహా అన్నీ కలిపి రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యుంటుందని ట్రేడ్ నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. అయితే రిలీజ్ కు ముందు ఏర్పడిన అంచనాలను మాత్రం సినిమా అందుకోలేకపోయింది.
మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కానీ డీసెంట్ రన్ ను కంటిన్యూ చేస్తోంది. హిందీ మార్కెట్ లో శుక్రవారం నాడు రూ.3.5 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో కలిపి ఇప్పటివరకు అక్కడ రూ.158 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. వీకెండ్ కావడంతో వసూళ్ల నెంబర్స్ పెరిగే అవకాశం ఉంది.
అదే సమయంలో ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా వార్-2 మూవీ రూ.332 కోట్లకు పైగా సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.53 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తమిళంలో రూ.1.70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలా హిందీలో రూ.160 కోట్లకు చేరువలో ఉన్నాయి వసూళ్లు.
కాగా.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వార్ 2 సినిమాకు రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ఇప్పటికే ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అందులో తెలుగు స్టేట్స్ హక్కులు యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రూ.90 కోట్లకు సొంతం చేసుకున్నారని వినికిడి. ఓవర్సీస్ లో రూ.56 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యాపారం జరిగినట్లు సమాచారం.
కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కుల నుంచి రూ.19 కోట్లు వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. అలా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. ఇప్పుడు ఇంకా రూ.270 కోట్లు వసూలు చేయాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..
