రిలీజ్ కు ముందే `వార్2` టాలీవుడ్ లో బ్లాస్ట్!
హృతిక్ రోషన్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ `వార్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 9:30 PMహృతిక్ రోషన్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ `వార్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `వార్` ప్రాంచైజీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు. ఇదే సినిమాతో హృతిక్ టాలీవుడ్ లో గ్రాండ్ విక్టరీకి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఎలాంటి ప్రచార చిత్రాలు రిలీజ్ కాకుండానే పాన్ ఇండియాలో సంచలన చిత్రంగా మారిపోయింది.
టీజర్....ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ విధ్వంసం ఎలా ఉంటుందన్నది ఊహకి కూడా అందదు. హృతిక్ రా ఏజెంట్ రోల్....తారక్ నెగిటివ్ రోల్ ఎలా ఉంటుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయాన్ ముఖర్జీ మేకింగ్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించడం ఖాయమంటూ అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు. దీంతో ఈ సినిమాకు తెలుగులో పెద్ద ఎత్తున బిజినెస్ అవుతుంది.
`వార్ 2` టాలీవుడ్ రైట్స్ కోసం బడా కంపెనీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో నాగవంశీ-సునీల్ నారంగ్ ముందున్నట్లు సమాచారం. యశ్ రాజ్ ఫిలింస్ తో 120 కోట్లకు డీల్ క్లోజ్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ రేంజ్ మార్కెట్ కు కారణంగా తారక్. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతోనే తారక్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అటుపై `దేవర` విజయంతో మరో పాన్ ఇండియా సక్సెస్ పడింది. రీజనల్ మార్కెట్ పరంగా తారక్ మార్కెట్ ఆకాశాన్ని తాకుతుంది.
ఆ లెక్కలు బేరీజు వేసుకుని 120 కోట్ల డీల్ క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. తారక్ ఉన్నాడు కాబట్టి టాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ ఖాయం. డబ్బింగ్ సినిమా అవుతుంది కాబట్టి వారం రోజులు ధరలు పెంచడానికి అవకాశం ఉండదు.హిట్ టాక్ తెచ్చుకుంటే బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టం కాదు. ఆ కాన్పిడెన్స్ తోనే 100 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15 కంటే ఒక్క రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు.