Begin typing your search above and press return to search.

వార్ 2 ట్రైలర్ ఫ్లాఫ్.. ఫస్ట్ సింగిల్ తో అయినా మంచిగా వస్తారా?

సూప‌ర్ హిట్ మూవీ వార్ కు సీక్వెల్ గా వార్ 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 July 2025 12:43 PM IST
వార్ 2 ట్రైలర్ ఫ్లాఫ్.. ఫస్ట్ సింగిల్ తో అయినా మంచిగా వస్తారా?
X

సూప‌ర్ హిట్ మూవీ వార్ కు సీక్వెల్ గా వార్ 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఫేమస్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్-2 మూవీ.. ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ అండ్ డబ్బింగ్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాటిని కూడా మరికొన్ని రోజుల్లో మేకర్స్ కంప్లీట్ చేయనున్నారు.

ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తారక్.. బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల సమయమే ఉంది. కానీ మేకర్స్ మాత్రం ఆడియన్స్ కు చాలా అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది.

కొద్ది రోజుల క్రితం మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ గ్లింప్స్ మాత్రం అందరినీ ఆకట్టుకోలేకపోయింది. చాలా మందిని నిరాశపరిచింది. దీంతో సరైన అప్డేట్ ఇవ్వాలని సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రానున్నట్లు సమాచారం.

ట్రైలర్ కన్నా ముందే.. వార్ 2 నుంచి తొలి పాటను మేకర్స్ రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వారంలోనే సాంగ్ రిలీజ్ కానుందని, అది కూడా రొమాంటిక్ సాంగ్ అని టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఫస్ట్ సింగిల్ తో అందరినీ ఆకట్టుకోవాల్సి ఉంది. కచ్చితంగా సినిమాపై వేరే లెవెల్ బజ్ క్రియేట్ చేయాల్సి ఉంది.

ఎందుకంటే టీజర్ నిరాశపరిచింది. దీంతో ఫస్ట్ సింగిల్ తో మూవీపై అందరి ఫోకస్ పడేలా చేయాలి. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి. వరుస అప్డేట్స్ తో సందడి చేయాలి. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో మంచి బజ్ క్రియేట్ చేయాలి. మరి మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న వార్-2 ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.