వార్-2.. నిర్మాతలు పెద్ద యుద్ధమే చేయాలేమో?.
అయితే తెలుగులో కూడా వార్-2 రిలీజ్ కానుండగా.. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌసెస్ పోటీ పడినట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 7 Jun 2025 11:00 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్-2 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ (డైరెక్ట్ హిందీ మూవీ) ఇస్తున్నారు. స్పై జోనర్ లో స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యష్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న వార్-2ను ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే తెలుగులో కూడా వార్-2 రిలీజ్ కానుండగా.. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కోసం టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌసెస్ పోటీ పడినట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ వారెవరికీ హక్కులు ఇవ్వమని యష్ రాజ్ ఫిల్మ్స్ చెప్పిందని టాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాను సొంతంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకుందని సమాచారం.
అదే సమయంలో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.90 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు వాటిని తిరిగి పొందాలంటే.. వార్-2 మేకర్స్.. పెద్ద యుద్ధమే చేయాలేమోనని అంటున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సేఫ్ జోన్ ఉండే ఛాన్స్ ఉన్నా.. రిస్క్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా స్పై జోనర్ కు తెలుగులో మరింత అంత ఫ్యాన్ బేస్ ఉండదు. అందుకే జోనర్ తోనే ఫస్ట్ సమస్య. ఆ తర్వాత ఎన్టీఆర్ సోలో మూవీ అయితే.. తెలుగులో భారీ వసూళ్లు రాబట్టడం ఈజీనే. కానీ సినిమా కంటెంట్ అంతా బాలీవుడ్ ఫ్లేవర్ లో ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. కాబట్టి తారక్ ప్రమోషన్స్ చేసినా అది సరిపోదు.
అదే సమయంలో వార్-2 రిలీజ్ రోజు కూలీ మూవీ విడుదల కానుంది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న ఆ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. సినిమాలో అన్ని ఇండస్ట్రీల నటులున్నారు. దీంతో వార్-2 కన్నా కూలీకే ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు వార్-2.. తెలుగులో ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి.
