వార్ 2 ఫ్లాష్ బ్యాక్‌లో తారక్ ఇచ్చే సర్‌ప్రైజ్
ఇక ఎన్టీఆర్, హృతిక్ ఒకరికొకరు ఎదురు పడినప్పుడు భీకర పోరాటాలతో థియేటర్లు దద్దరిల్లుతాయట. ఎన్టీఆర్ విలన్ గా నటిస్తుండగా, కబీర్ అనే రా ఏజెంట్ గా ఈ చిత్రంలో హృతిక్ నటిస్తున్నాడు.
By: Tupaki Desk | 23 Jun 2025 7:00 AM ISTబాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేర్ కాంబినేషన్ లో రూపొందుతున్న `వార్ 2` సర్వత్రా ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ రాజీ అన్నదే లేకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ హై అక్టేన్ యాక్షన్ మూవీని నిర్మిస్తోంది. ఇందులో కియరా అద్వాణీ ఒక కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ డ్యాన్స్ నంబర్ నభూతోనభవిష్యతి అనే విధంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇంతకుముందు విడుదలైన టీజర్ లో కియరా అద్వాణీ బికినీలో మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే. ఇక వార్ 2 ఆద్యంతం చెప్పుకునేందుకు చాలా మెరుపులు ఉంటాయని తాజాగా లీకులు అందాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చే సర్ ప్రైజ్ ఊహించని విధంగా ఉంటుందని తెలిసింది. తారక్ సినిమా అంతటా లైవ్ గా కనిపించే గెటప్ కి, ఫ్లాష్ బ్యాక్ లో గెటప్ కి అసలు పోలికే ఉండదని, తారక్ ని గుర్తించడం కూడా కష్టంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇక ఎన్టీఆర్, హృతిక్ ఒకరికొకరు ఎదురు పడినప్పుడు భీకర పోరాటాలతో థియేటర్లు దద్దరిల్లుతాయట. ఎన్టీఆర్ విలన్ గా నటిస్తుండగా, కబీర్ అనే రా ఏజెంట్ గా ఈ చిత్రంలో హృతిక్ నటిస్తున్నాడు. ఇద్దరి మధ్యా హోరాహోరీ చుట్టూ అయాన్ ముఖర్జీ కథను అల్లారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే మెజారిటీ సమయం కేటాయించామని అతడు చెప్పారు. భారతదేశంలో ఇద్దరు స్టార్లు తెరపై ఢీకొడుతుంటే అది అభిమానులకు మజా ఇస్తుందని, మునుపెన్నడూ చూడని విధంగా వారిని చూపించానని అయాన్ ముఖర్జీ చెబుతున్నారు.
అయితే ఇందులో ధూమ్, రేస్, పఠాన్ తరహా యాక్షన్ ఘట్టాలు కాకుండా సరికొత్త యక్షన్ ఎపిసోడ్స్ ని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మరో వారంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. హిందీ, తెలుగు, తమిళం సహా పలు భాషల్లో వార్ 2 అత్యంత భారీగా ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.
