'వార్ -2' ప్రీరిలీజ్ పబ్లిక్ గానా? ప్రయివేట్ గానా?
బాలీవుడ్ చిత్రం `వార్ - 2` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో పది రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 4 Aug 2025 11:00 PM ISTబాలీవుడ్ చిత్రం 'వార్ - 2' రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో పది రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. బాలీవుడ్ రిలీజ్ కు సంబంధించి హృతిక్ రోషన్...టాలీవుడ్ రిలీజ్ కు సంబంధించి తారక్ వేర్వేరుగా ప్రచారం చేయబో తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్దమైంది. ఇద్దరు అన్ని వేదికలపై కలిసి ప్రచారం చేస్తే అనుకున్న స్థాయిలో రీచ్ రాదని భావించిన టీమ్ ఇలా వేర్వేరుగా ప్లాన్ చేసి ముందుకెళ్తోంది.
ప్రీ రిలీజ్ పై సందేహం
మరి ఇద్దరు కలిసి ప్రచారం చేసే వేదిక ఏదైనా ఉందా? అంటే అది హైదరాబాద్ లో నిర్వహించే ప్రీరిలీజ్ వేడుక మాత్రమే అవుతుంది. యంగ్ టైగర్ అభిమానుల కోసం హైదరాబాద్ లో భారీ ఈవెంట్ తప్పనిసరి. అయితే అది పబ్లిక్ గా నిర్వహించాలా? ప్రయివేట్ గా నిర్వహించాలా? అన్నది సందేహంగా మారింది. ఎలా నిర్వహించినా సినిమాకు సంబంధించి అదే చివరి ఈవెంట్ అవుతుంది కాబట్టి తారక్ తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొంటారు. భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో గ్రౌండ్ లో నిర్వహించాలంటే అందుకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి.
వార్ 2కు దేవర లా కాదు గా
మరి ఈసారి అందుకు ప్రభుత్వం సహకరిస్తుందా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. తారక్ గత సినిమా 'దేవర' రిలీజ్ సమయంలో ప్రీరిలీజ్ కు ప్రభుత్వం అనుమతివ్వని సంగతి తెలిసిందే. భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో సినిమా ఈవెంట్లు నిర్వహించడం వల్ల ప్రేక్షకుల ప్రాణాలకు ముప్పుగా భావించి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో 'దేవర' రిలీజ్ ప్రీరిలీజ్ లేకుండానే రిలీజ్ అవ్వాల్సిన సన్నివేశం ఎదురైంది. ఈ విషయంలో తారక్ అభిమానుల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు.
నిర్మాత సన్నధం ఎలా?
రాజకీయ క్షక్ష ఉంది? అనే ప్రచారం కూడా జరిగింది. దీంతో `దేవర` రిలీజ్ కు ముందు పెద్దగా హడావుడి లేకుండా థియేటర్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 'వార్ 2' రిలీజ్ విషయంలోనూ ఇదే కొనసాగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ ఈవెంట్ కు అనుమతి రాకపోతే గనుక స్టార్ హోటల్ లో కొద్ది మంది అభిమానుల సమక్షంలో ఈవెంట్ జరిగే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి తెలుగు వెర్షన్ నిర్మాతలు ఎలా సన్నధమవుతున్నారు? అన్నది తెలియాలి.
వాళ్లలోనూ మార్పు మొదలైంది!
కానీ తారక్-హృతిక్ జోడీని ఒకే వేదిపై చూడాలని ఎంతో మంది తెలుగు అభిమానులు ఆశపడుతున్నారు. మరి అందుకు ఆస్కారం ఉంటుందా? ఉన్నదా? అన్నది మరో నాలుగైదు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నార్త్ రిలీజ్ కు సంబంధించి బాలీవుడ్ లో సినిమా ప్రచారం అంటూ పెద్దగా ఉండదు. రిలీజ్ కు ముందు సింపుల్ గా ఓ ప్రెస్ మీట్ తో ముగిస్తారు. అదే సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం. ఏ బాలీవుడ్ సినిమాకైనా ప్రచారం ఇలాగే ఉంటుంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ని చూసి వాళ్ల ప్రచార శైలిలోనూ మార్పు కనిపిస్తోంది.
