'వార్ 2' సాంగ్: నువ్వా నేనా? ఢీ అంటే ఢీ!
హృతిక్- ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన `వార్ 2` ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
By: Tupaki Desk | 1 July 2025 8:30 AM ISTహృతిక్- ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన `వార్ 2` ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఒక బాలీవుడ్ అగ్ర హీరోని, ఒక టాలీవుడ్ అగ్ర హీరోతో కలిపి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించడం ద్వారా ఉత్తరాది, దక్షిణాది మార్కెట్లను కొల్లగొట్టాలన్నది యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పన్నాగం. అయితే ఈ పన్నాగం ఫలిస్తుందా లేదా? అనేదానికి ఇప్పటికి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
హృతిక్, ఎన్టీఆర్ తమ కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ మరో లెవల్లో ఉండబోతోందని దర్శకుడు చెబుతున్నాడు. ఫైట్ సీక్వెన్సులను నెవ్వర్ బిఫోర్ అనేలా చూపిస్తున్నాను.. ఇద్దరు స్టార్లు ఒకరికొకరు ఎదురు పడితే భీకర పోరాటాలు ఉంటాయని దర్శకుడు చెబుతున్నాడు. అయితే డ్యాన్సుల్లోను హృతిక్, ఎన్టీఆర్ ఒకరిని మించి ఒకరు ఆరితేరిన వారు. అందువల్ల ఈ జోడీపై ఒక స్పెషల్ పాటను ప్లాన్ చేసారని కూడా కథనాలొచ్చాయి. పాటలో ఒకరితో ఒకరు పోటీపడుతూ నువ్వా నేనా? అనేంతగా స్టెప్పులతో అదరగొడతారని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ఒక భారీ సెట్ లో జరుగుతోంది. మంగళవారం చిత్రీకరణ ప్రారంభించి 7 జూలై నాటికి పూర్తి చేస్తారు. ఇది పూర్తయితే మొత్తం షూట్ పూర్తయినట్టే. ప్రీతమ్ ఈ పాటను కంపోజ్ చేయగా, బోస్కో-సీజర్ కొరియోగ్రఫీ చేస్తారు. తారక్, హృతిక్ అభిమానులకు ఇది స్పెషల్ ట్రీట్ గా మారనుందని అంచనా వేస్తున్నారు.
