ఆ ఒక్క మాటతో 'వార్ 2' స్థాయి డబుల్
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'వార్ 2' పై అంచనాలు భారీగా ఉన్నాయి.
By: Tupaki Desk | 11 Jun 2025 2:46 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'వార్ 2' పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ మొదటి హిందీ సినిమా కావడంతో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రాబోతున్న అతి పెద్ద స్పై థ్రిల్లర్ ఇదే కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఆ మధ్య వచ్చిన టీజర్ సినిమా క్రేజ్ ను కాస్త తగ్గించిన విషయం నిజమే కానీ, మెల్ల మెల్లగా మేకర్స్ సినిమా క్రేజ్ పెంచే విధంగా ప్రమోషన్ హడావిడి చేస్తున్నారు. అందుకే ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్నా కొద్ది సోషల్ మీడియాలో విపరీతంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు.
తాజాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యల కారణంగా అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమాపై బజ్ దాదాపుగా డబుల్ అయింది అంటూ బాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. కరణ్ జోహార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇద్దరు స్టార్ హీరోలు... అది కాకుండా ఒక బాలీవుడ్ స్టార్ హీరో, ఒక సౌత్ స్టార్ హీరో కలిసి నటించడం అనేది ఖచ్చితంగా అరుదైన కలయిక. ఈ కలయిక కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ ఏడాది లో అతి పెద్ద సినిమాల్లో వార్ 2 నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన బ్యానర్‌లో రూపొందుతున్న సినిమా కాకున్నా కూడా ఆయన పాజిటివ్‌గా స్పందిచడంతో అంచనాలు పెరిగాయి.
హృతిక్ రోషన్ సినిమా అంటే సహజంగానే బాలీవుడ్‌లో అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటి హృతిక్ రోషన్ సినిమాలో ఎన్టీఆర్ నటించడంతో పాటు, ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన కారణంగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా చాటాడు. తన డాన్స్‌తో ఇప్పటికే చాలా మంది నార్త్ ఇండియన్స్‌ను అభిమానులుగా చేసుకున్న ఎన్టీఆర్ వార్ 2లోని తన యాక్షన్‌తో అభిమానులుగా మార్చుకునే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో అడుగు పెట్టిన హీరోల్లో ఎక్కువ శాతం నిరాశ పరిచారు. కానీ ఎన్టీఆర్‌కి మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ కాదని తెలుస్తోంది.
వార్ 2 సినిమా బాలీవుడ్ నుంచి రాబోతున్న అతి పెద్ద స్పై థ్రిల్లర్‌గా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో స్పై థ్రిల్లర్ జోరు తగ్గుతుందని అంటున్నారు. కానీ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. వార్ 2 సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒక ఏరియాలో దిల్ రాజు పంపిణీ చేయడానికి ముందుకు రావడం విశేషం. మిగిలిన ఏరియాల్లో నిర్మాణ సంస్థ స్వయంగా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హృతిక్ కి జోడీగా కియారా అద్వానీ నటించింది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి అయింది. ఆగస్టు లో రాబోతున్న వార్ 2 సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అనే ధీమాను తాజా ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ వ్యక్తం చేశారు.