వార్ 2 : అది వదిలి తప్పు చేశారా?
సూపర్ హిట్ మూవీ సీక్వెల్, ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ మూవీ, సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా కావడంతో 'వార్ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
By: Tupaki Desk | 26 Jun 2025 11:02 AM ISTసూపర్ హిట్ మూవీ సీక్వెల్, ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ మూవీ, సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా కావడంతో 'వార్ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంగా ఈ సినిమా గురించి జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు అన్ని చోట్ల తెగ ప్రచారం జరిగింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన స్పై థ్రిల్లర్స్‌తో పోల్చితే ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అంటూ మేకర్స్ నుంచి పదే పదే ప్రకటనలు వచ్చాయి. ఇక ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడంతో కూడా అంచనాలు ఇంకాస్త పెరిగాయి. కానీ సినిమా విడుదల సమయంకు వార్ 2 బజ్ డల్ అయింది.
ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచేద్దాం అనుకున్న మేకర్స్ ఆ మధ్య టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ఎన్టీఆర్ లుక్, హృతిక్ రోషన్ యాక్షన్ సీక్వెన్స్, పూర్ వీఎఫ్‌ఎక్స్ ఇలా చాలా మైనస్ పాయింట్స్ ఉండటంతో సినిమా బజ్ తగ్గుతూ వచ్చింది. సోషల్ మీడియాలో దాదాపు రెండు వారాల పాటు చేసిన ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీజర్‌కి వచ్చిన స్పందనతో సినిమాను మరింత జోరుగా ప్రమోట్ చేయాలి అనుకున్న మేకర్స్ ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ప్రమోషన్‌లో భాగంగా మరో టీజర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.
టీజర్ చేసిన డ్యామేజీ చాలదన్నట్లు మరో టీజర్ అవసరమా అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. మొత్తానికి వార్ 2 సినిమాకు మళ్లీ బజ్ క్రియేట్ చేయాలంటే మేకర్స్ ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వార్ 2 నుంచి టీజర్‌ను విడుదల చేయడం అనేది పెద్ద తప్పు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలకు టీజర్‌ను విడుదల చేయాలంటే కంటెంట్ మహా అద్భుతంగా ఉండాలి, కానీ టీజర్ లో నిరాశ మిగిల్చే విధంగా కంటెంట్ ఉంది. అందుకే తప్పు జరిగింది అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఆలోచన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
ఆగస్టు 15న సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఓవర్సీస్‌లో ఈ సినిమా మేకర్స్ వంద కోట్ల వసూళ్లు సాధిస్తుందని ఆశ పెట్టుకున్నారు. అక్కడ టీజర్ పెద్దగా ఇంపాక్ట్ చేయక పోవడంతో మార్కెట్ డల్‌గా ఉంది. ప్రస్తుతం ఉన్న లో బజ్‌ను మార్చాలి అంటే కచ్చితంగా చాలా పెద్ద ప్రమోషన్ ప్లాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వార్ 2 మేకర్స్ ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారు. ఈ నెల చివరి వరకు సినిమా నుంచి ప్రత్యేక పాట రాబోతుంది. అందులో హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ఆడి పాడబోతున్నారు. ఆ పాటతో సినిమా బజ్ పెరగడం ఖాయం అనేది మేకర్స్ ఆలోచన. పాటతో సినిమా బజ్ ఏ మేరకు పెరుగుతుంది అనేది చూడాలి.
