Begin typing your search above and press return to search.

సూర్య కోసం వెయిటింగ్ తప్పదా..?

పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో తన స్టామినా చూపించాలని చూస్తున్నారు సూర్య.

By:  Tupaki Desk   |   1 Jan 2024 12:30 AM GMT
సూర్య కోసం వెయిటింగ్ తప్పదా..?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం శివ డైరెక్షన్ లో కంగువ సినిమా చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో తన స్టామినా చూపించాలని చూస్తున్నారు సూర్య. కంగువ తర్వాత సూర్య సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉందని తెలుస్తుంది.

ముఖ్యంగా సూర్య తెలుగు స్ట్రైట్ సినిమా కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో సూర్య త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అవేవి జరగలేదు. సూర్యతో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని కొంత హడావుడి జరిగింది. ఓ ఈవెంట్ లో బోయపాటితో తాను సినిమాకు సిద్ధమని సూర్య కూడా చెప్పాడు. కానీ బోయపాటి ట్రాక్ రికార్డ్ చూసిన సూర్య ఫ్యాన్స్ మాత్రం అతనితో సినిమా చేయకపోవడమే బెటర్ అని భావిస్తున్నారు.

ఇక ఇదిలాఉంటే సూర్య ఆల్రెడీ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటితో ఒక సినిమా ఓకే అన్నాడని టాక్. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకున్న చందు మొండేటి ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ అంటూ మరో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూర్యతో సినిమా ఉంటుందని టాక్. సూర్య కూడా చందు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

సూర్య కంగువ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై భారీ క్రేజ్ తీసుకొచ్చాయి. కొన్నాళ్లుగా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న కమర్షియల్ సినిమా కంగువ. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యారు సూర్య.

కంగువ తర్వాత సూర్య తమిళంలో మరో సినిమా చేస్తాడట. ఆ తర్వాత చందు సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని సూర్య ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. చందుతో చేస్తాడా లేదా మరో దర్శకుడితో కమిట్ అవుతాడా అన్నది తెలియదు కానీ సూర్య తెలుగు స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని ఇక్కడి ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ విషయంలో సూర్య కాస్త సీరియస్ గా థింక్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.