Begin typing your search above and press return to search.

ఆ డేట్ కి ఫిక్స్ అయిన విశ్వక్ సేన్

సినిమా అవుట్ పుట్ పై విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట. అలాగే దర్శకుడు కూడా కచ్చితంగా హిట్ కోడతాననే నమ్మకంతో ఉన్నారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 5:23 AM GMT
ఆ డేట్ కి ఫిక్స్ అయిన విశ్వక్ సేన్
X

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరి తీరంలో జరిగే రౌడీయిజాన్ని ఈ చిత్రంలో దర్శకుడు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

సినిమా అవుట్ పుట్ పై విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట. అలాగే దర్శకుడు కూడా కచ్చితంగా హిట్ కోడతాననే నమ్మకంతో ఉన్నారు. అందుకే తమ సినిమాని జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి కరెక్ట్ టైం డిసెంబర్ 8 అని ముందుగానే డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే తేదీకి నితిన్ ఎక్స్ట్రార్దినరీ మెన్ మూవీ కూడా రాబోతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ముందుగా ఎనౌన్స్ చేశారు. అయితే డిసెంబర్ 22న సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ కారణంగా నితిన్ మూవీని ముందుగానే రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమై రీసెంట్ గా డిసెంబర్ 8 డేట్ ఎనౌన్స్ చేశారు. ఇక అదే రోజు వరుణ్ తేజ్ హిందీ, తెలుగు భాషలలో చేస్తోన్న మూవీ ఆపరేషన్ వాలంటైన్ ని రిలీజ్ చేయబోతున్నారు.

రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ కథని దర్శకుడు సిద్ధం చేసుకొని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఒకే రోజు ముగ్గురు యంగ్ హీరోలు తమ సినిమాలు రిలీజ్ పెట్టుకోవడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. అయితే ఈ పోటీలో వెనక్కి తగ్గేందుకు విశ్వక్ సేన్ సిద్ధంగా లేరు.

సినిమా అవుట్ పుట్ మీద ఉన్న నమ్మకంతో అదే డేట్ కి రావాలని డిసైడ్ అయ్యాడంట. ఎన్ని సినిమాలు వచ్చిన కచ్చితంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బలంగా నిలబడుతుందని విశ్వక్, దర్శకుడు కృష్ణ చైతన్య భావిస్తున్నారంట. అందుకే సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా కాన్ఫిడెంట్ గానే రిలీజ్ కి సిద్ధం అవుతున్నారంట.