Begin typing your search above and press return to search.

GOG టెకీలా కిక్: విశ్వక్ సేన్

ట్రైలర్ ఇచ్చే కిక్ సరిపోకా రెండు టెకీలాలు వేసుకొని వచ్చా అంటూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తూ ఇంటెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   26 May 2024 4:17 AM GMT
GOG టెకీలా కిక్: విశ్వక్ సేన్
X

కొత్త కథలని ఎంచుకుంటూ, మంచి ఇంటెన్షన్ ఉన్న క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. తన మొదటి చిత్రం నుంచి ప్రస్తుతం రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక వేరియేషన్ ఉండేలా విశ్వక్ కేర్ తీసుకుంటున్నాడు. అందుకే సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అతనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ లభిస్తోంది.

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే 31న రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ యంగ్ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. క్యారెక్టర్ పరంగా మంచి డెప్త్ కనిపిస్తోంది. ట్రైలర్ లోనే అతని పెర్ఫార్మెన్స్ ఏ లెవల్ లో ఉండబోతుందో చూపించేసాడు.

దీంతో ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ట్రైలర్ ఇచ్చే కిక్ సరిపోకా రెండు టెకీలాలు వేసుకొని వచ్చా అంటూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తూ ఇంటెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ ట్రైలర్ టీజర్ అనుకోండి. ఇంతకుమించి సినిమాలో కంటెంట్ ఉంటుందని చెప్పాడు.

అలాగే ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ కూడా తన స్పీచ్ లో ఉపయోగించాడు. అక్కడక్కడ మూసి ఉన్న థియేటర్స్ కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో కళకళలాడాలని కోరారు. ముందు ఐపీఎల్ ఫైనల్ ఎంజాయ్ చేయండి, తరువాత మా ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి. మే 31న సినిమాని ఎంజాయ్ చేయండి అంటూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు.

అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు పరోక్షంగా విశ్వక్ సేన్ హిట్ ఇచ్చారు. నందమూరి నటసింహం అంటే ఇక ఫ్యాన్స్ ఉత్సాహానికి అవధులు ఉండవు. కచ్చితంగా ప్రీరిలీజ్ రోజు సందడి నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్ అయితే విశ్వక్ సేన్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్స్ అవుతాయి. ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, అంజలి కీలక పాత్రలో కనిపిస్తోంది. సాయి కుమార్, నాజర్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు.