Begin typing your search above and press return to search.

విశ్వక్ GOG.. ఇక తిరుగులేనట్లే!

ఇక విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి శివరాత్రి కానుకగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   10 March 2024 6:03 AM GMT
విశ్వక్ GOG.. ఇక తిరుగులేనట్లే!
X

టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్.. ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీలో అఘోర శంకర్ పాత్రలో తన యాక్టింగ్ తో అదరగొట్టారు విశ్వక్. ఏ పాత్రనైనా తాను రెడీ అని మరోసారి నిరూపించారు. అయితే ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. తొలిరోజు రూ.9.07 కోట్లు వసూళ్లు రాబట్టి విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

అయితే గామి చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ అందుకుంటో లేదో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. విడుదలకు ముందు ఈ మూవీ కాన్సెప్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్ధమవుతుందో లేదోనని మేకర్స్ చాలా టెన్షన్ పడ్డారట. ఇప్పుడు మంచి ఓపెనింగ్స్ సాధించడంతో ఊపిరి పీల్చుకున్నారట. విశ్వక్ చేసిన ప్రయోగానికి మూవీ లవర్స్ తోపాటు సినీ క్రిటిక్స్ మెచ్చుకుంటున్నారు.

ఇక విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి శివరాత్రి కానుకగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. మ్యూజిక్ వర్క్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ లేట్ కావడంతో మేకర్స్ రిలీజ్ వాయిదా వేశారు. అయితే మార్చిలో ఈ మూవీ రిలీజ్ పాజిబుల్ కానట్లే. ఎందుకంటే మార్చి 29వ తేదీ టిల్లు స్క్వేర్ రిలీజ్ కానుంది. దీంతో GOG ఏప్రిల్ లేదా మేలో విడుదలయ్యే అవకాశం ఉంది.

అయితే గామి మూవీ రిజల్ట్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి కలిసి వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పక్కా హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య.. మూవీని ఇంటెన్స్ గా తెరకెక్కించారట. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు.

అయితే విశ్వక్ లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్న విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న లైలా మూవీలో లేడీ గెటప్ పోషించనున్నారు విశ్వక్ సేన్. సెకండాఫ్ లో చాలాసేపు లేడీ గెటప్ లోనే కనిపించనున్నారు. దీంతోపాటు మెకానిక్ రాకీ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. కల్ట్ మూవీలో నటించకపోయినా నిర్మిస్తున్నారు. ఈ మూవీలన్నీ 2024లో విడుదల కానున్నట్లు సమాచారం. మరి విశ్వక్ వరుస సినిమాలు ఎలాంటి హిట్లు అవుతాయో చూడాలి.