దళపతి ప్లేస్ కి ప్రమోట్ అయ్యేది ఎవరు..?
చివరి సినిమా జన నాయగన్ పూర్తి అవ్వడమే ఆలస్యం ఇక సినిమాలు ఆపేసి జనాల్లోనే ఉండాలని వారి బాగోగులు చూసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాడు
By: Tupaki Desk | 10 Jun 2025 5:22 PMదళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చేశాడు. చివరి సినిమా జన నాయగన్ పూర్తి అవ్వడమే ఆలస్యం ఇక సినిమాలు ఆపేసి జనాల్లోనే ఉండాలని వారి బాగోగులు చూసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీని అక్కడ సినీ స్టార్స్ కూడా ఆహ్వానించారు. ఐతే విజయ్ సినిమాలు మానేస్తే కోలీవుడ్ లో టాప్ 1 ప్లేస్ ఖాళీ అయినట్టే. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ ఉన్నా కూడా దళపతి విజయ్ ఇన్నాళ్లు టాప్ లో ఉంటూ వచ్చాడు.
విజయ్ తో సమకాలీకులైన సూర్య, విక్రం, ధనుష్ లాంటి వారు మాత్రం ఆయనకు పోటీ అవ్వలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు కూడా సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు కానీ విజయ్ ని టచ్ చేయలేకపోయారు. ఐతే ఇప్పుడు దళపతి విజయ్ సినిమాలకు దూరమవుతున్నాడు. సినిమాల్లో ఆయన టాప్ ప్లేస్ ఖాళీ అవుతుంది మరి ఆ ప్లేస్ ని ఎవరు ఆక్యుపై చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది.
విజయ్ తో పాటు ఆయనకు సమానమైన ఫ్యాన్ బేస్ ఉన్న వారిలో తల అజిత్ ఉన్నాడు. విజయ్ సినిమాలు మానేస్తే తల మొదటి స్థానం లోకి వస్తాడా అంటే అజిత్ తీసే సినిమాలు కేవలం యాక్షన్ ఓరియెంటెడ్ గా అడ్వెంచరస్ గా ఉంటాయి. అవి అందరి ఆడియన్స్ కి నచ్చాలని రూల్ లేదు. సో అజిత్ కి టాప్ 1 ఛాన్స్ ఉన్నా ఆయన వెరైటీ కథలు చేయాల్సి ఉంది. ఐతే ఈ టాప్ చెయిర్ పై అజిత్ కు అంతగా ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది. ఇక సూర్య, ధనుష్, విక్రం వీళ్లు కూడా తమ సినిమాలు తాము తీసుకుంటూ వెళ్లడమే అన్నట్టుగా ఉన్నారు.
సో కోలీవుడ్ లో ఈ టాప్ చెయిర్ ఆట లేనట్టుగానే అనిపిస్తుంది. ఐతే బయటకు అలా కనిపిస్తున్నా విజయ్ ప్లేస్ కోసం యువ స్టార్స్ సైతం ట్రై చేసే ఛాన్స్ లేకపోలేదు. ఈమధ్య కోలీవుడ్ లో శివ కార్తికేయన్ దూకుడు కూడా బాగానే ఉంది. సో ఏమో అతను వరుస సక్సెస్ లతో దూసుకెళ్తే టాప్ ప్లేస్ కి అతను వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తానికి విజయ్ సినిమాలు తీయడం మానేస్తే ఆయన స్థానంలో ప్రేక్షకులు ఎవరిని రీప్లేస్ చేస్తారు అన్న దాని మీద కోలీవుడ్ ఆడియన్స్ లో పెద్ద డిస్కషన్ నడుస్తుంది.