వెంకీ అట్లూరి.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీతో ఆయన మంచి హిట్ ను అందుకున్నారు.
By: Tupaki Desk | 7 May 2025 7:05 AMటాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీతో ఆయన మంచి హిట్ ను అందుకున్నారు. మాలీవుడ్ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఆ సినిమాతో అందరినీ మెప్పించారు. తన టాలెంట్ తో మరోసారి సినీ ప్రియులను ఆకట్టుకున్నారు.
ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్యతో వర్క్ చేస్తున్నారు. ఆ విషయాన్ని కొద్ది రోజుల క్రితం సూర్యనే వెల్లడించారు. తన రీసెంట్ మూవీ రెట్రో ప్రమోషనల్ ఈవెంట్ లో వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించనున్నట్లు కూడా అప్డేట్ ఇచ్చారు సూర్య.
దీంతో ఇప్పటికే ఆ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై మాట్లాడారు. తన నెక్స్ట్ మూవీ.. డైరెక్టర్ కోలీవుడ్ సినిమా అని తెలిపారు. ఆ సమయంలో హోస్ట్.. ఆ ప్రాజెక్ట్ సూర్యతోపాటు ధనుష్ కూడా యాక్ట్ చేస్తున్నారని విన్నాం.. నిజమేనా అని అడిగారు.
దీంతో ఒక వారంలో మూవీ అప్డేట్ వస్తుందని తెలిపారు. ఆ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను కూడా చెప్పారు. ప్రస్తుతం సూర్య.. ఆర్జే బాలాజీతో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో వెంకీ అట్లూరి ప్రాజెక్టును కూడా పారలల్ గా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ధనుష్.. అటు నటుడిగా.. ఇటు నిర్మాతగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు పలు సినిమాలను పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో వెంకీ అట్లూరితో సార్ సినిమాకు గాను వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీతో వేరే లెవెల్ హిట్ అందుకున్నారు. తమిళం, తెలుగు.. రెండు భాషల్లో కూడా సార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు మరోసారి సూర్య సినిమాలో ధనుష్ నటిస్తున్నారా అని హోస్ట్ అడగడంతో అంతా షాకవుతున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆ మూవీ కోసం వెంకీ అట్లూరి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు. మరోసారి తన టాలెంట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కాలా అనిపిస్తుందని చెబుతున్నారు. మరి చూడాలి వెంకీ అట్లూరి ఏం చేస్తారో.. ఎలాంటి అప్డేట్ ఇస్తారో..