వెట్రిమారన్ తో మూవీ.. సూర్య తప్పుకున్నాడా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో వాడి వాసల్ మూవీ రూపొందుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 Jun 2025 6:00 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో వాడి వాసల్ మూవీ రూపొందుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. 2022లో ప్రకటన రాగా, సినిమా నేపథ్యానికి సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ అప్పట్లో విడుదల చేశారు. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంతో మూవీ తెరకెక్కుతోంది.
గ్లింప్స్ రిలీజ్ తర్వాత మూవీకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని కొన్ని నెలల క్రితం టాక్ వినిపించింది. అక్కడికి కొద్ది రోజుల తర్వాత వెట్రిమారన్ స్పందించారు. విడుదల 2 తర్వాత తాను తెరకెక్కించేది వాడి వాసల్ అని చెప్పి అప్పట్లో రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.
రీసెంట్ గా.. సూర్యతో మీరు చేస్తున్న వాడి వాసల్ సినిమాపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయని ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రస్తావించగా, వెట్రిమారన్ అప్పుడు స్పందించారు. తాను మూవీల విషయంలో 100 శాతం అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. అంతే తప్ప అంచనాలకు బాధ్యత వహించలేనని నవ్వుతూ అన్నారు.
అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి సూర్య తప్పుకున్నట్లు జోరుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వెట్రిమారన్ ఇంకా బౌండ్ స్క్రిప్ట్ ను పూర్తి చేయలేకపోవడంతో సూర్య తప్పుకోవాలని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. రూరల్ డ్రామాగా రూపొందనున్న ఆ సినిమాలో సూర్య డ్యూయల్ పోషించాల్సి ఉందని.. ఇప్పుడు తప్పుకున్నారని వినికిడి.
2025 చివర్లలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని, ఆ తర్వాత వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించనున్న ఆ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. మరి సూర్య తప్పుకోవడంతో ప్రాజెక్ట్ ఏమవుతుందోనని అంతా డిస్కస్ చేస్తున్నారు.
అయితే సూర్య ప్లేస్ లో మరో స్టార్ హీరో శింబు నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అది నిజమో కాదో తెలియదు. వాస్తవానికి.. వెట్రిమారన్ తన తర్వాత ప్రాజెక్ట్ శింబుతో చేయనున్నారని తెలుస్తోంది. కానీ అది వాడి వాసల్ నా లేదా కొత్త ప్రాజెక్టా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇప్పుడు వాడి వాసల్ కు సంబంధించి ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో వేచి చూడాలి.
