Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌తో ఫోటో.. సారీ చెప్పిన ఊర్వ‌శి

ఈ ఫోటోకోసం ఫిల్ట‌ర్లు వాడిన ఊర్వ‌శి.. చైనా ఫోన్ ఉప‌యోగించి అలా చేసినందుకు సారీ అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా తార‌క్ పై త‌న అభిమానాన్ని ఊర్వ‌శి దాచుకోలేదు.

By:  Tupaki Desk   |   15 April 2024 5:35 PM GMT
ఎన్టీఆర్‌తో ఫోటో.. సారీ చెప్పిన ఊర్వ‌శి
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. అత‌డికి సెల‌బ్రిటీల్లోను అభిమానులున్నారు. అందాల న‌టి, స్పెష‌ల్ ఐట‌మ్ గాళ్ ఊర్వ‌శి రౌతేలా తార‌క్ కి ఎంత పెద్ద అభిమాని అన్న‌ది ఇప్పుడు తేట తెల్ల‌మైంది. ప్ర‌స్తుతం వార్ 2 చిత్రీక‌ర‌ణ కోసం ముంబైలో ఉన్న తార‌క్ జిమ్ లో తీవ్రంగానే క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. అక్క‌డ అందాల ఊర్వ‌శి తార‌క్ ని క‌లిసి లైన్ హార్టెడ్ (సింహ‌మంటి హృద‌యం క‌లిగిన కుర్రాడు) తార‌క్ తో సెల్ఫీ అంటూ ఒక అంద‌మైన ఫోటోని షేర్ చేసింది.

అయితే ఈ ఫోటో ఎడిటెడ్ అంటూ అభిమానులు ర‌చ్చ చేయ‌డం ప్రారంభించారు. దీంతో ఊర్వ‌శి సారీ చెప్పాల్సి వ‌చ్చింది. ఈ ఫోటోకోసం ఫిల్ట‌ర్లు వాడిన ఊర్వ‌శి.. చైనా ఫోన్ ఉప‌యోగించి అలా చేసినందుకు సారీ అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా తార‌క్ పై త‌న అభిమానాన్ని ఊర్వ‌శి దాచుకోలేదు. కానీ తార‌క్ ఎంతో సింపుల్ గా విన‌మ్రంగా త‌న‌తో క‌లిసి సెల్ఫీ దిగిన వైనం అంద‌రి మ‌నసులు దోచుకుంది.

ఇక‌పోతే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హృతిక్ తో ఢీకొట్టేందుకు ప్రిపేర్డ్ గా ఉన్నాడు. అత‌డు జిమ్ లో క‌ఠోరంగా శ్ర‌మిస్తూ గ్రీక్ గాడ్ కి ధీటుగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ చిత్రంలో హృతిక్ తో పోటీప‌డుతూ డ్యాన్సులు చేయాల్సి ఉంటుంది.

అలాగే అత‌డితో పోటీప‌డుతూ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద‌రగొట్టాల్సి ఉంటుంది. లుక్ ప‌రంగా చాలా జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. అందుకే తార‌క్ అన్నివిధాలా ప్రిపేర‌వుతున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ లో ఆఫ‌ర్ అంటే ఆషామాషీ కాదు. అలాంటి ల‌క్కీ ఛాన్స్ ప్ర‌భాస్, చ‌ర‌ణ్ కంటే ముందే కొట్టేశాడు తార‌క్. దానిని నిరూపిస్తాడ‌నే అంతా ఆశిస్తున్నారు.