ఉబ్బిన పెదవులు వాచిన ముఖం.. ఊర్ఫీకి ఏమైంది?
అందం పెంచుకునేందుకు అతివలు నానా పాట్లు పడుతున్నారు. ఇక సెలబ్రిటీ ప్రపంచంలో సిత్ర విచిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
By: Tupaki Desk | 21 July 2025 1:00 PM ISTఅందం పెంచుకునేందుకు అతివలు నానా పాట్లు పడుతున్నారు. ఇక సెలబ్రిటీ ప్రపంచంలో సిత్ర విచిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కోసారి సౌందర్య సాధనాలు వికటించి, శస్త్ర చికిత్సలు విఫలమై ఉన్న అందం కాస్తా ఊడిపోయే పరిస్థితి కూడా దాపురిస్తోంది. సెలబ్రిటీల పుణ్యమా అని ఫేక్ సర్జన్ల గుట్టు కూడా రట్టవుతోంది. అపుడెపుడో హాలీవుడ్ లో ఫలానా కథానాయిక పెదవులకు, ముఖానికి శస్త్ర చికిత్స వికటించి ఏలియన్ లా మారిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇప్పుడు బో*ల్డ్ బ్యూటీ ఊర్ఫీ జావేద్ రూపం కూడా అదే విధంగా షాకిచ్చింది. ఉబ్బిన పెదవులు, వాచిన ముఖం చూడలేక అభిమానులు చాలా కంగారు పడిపోతున్నారు. ఊర్ఫీ లిప్ ఫిల్లర్ల కోసం ట్రై చేసింది. కానీ అవి వికటించి ఘోరమైన పరిస్థితి దాపురించింది. ఇది దాదాపు 9 ఏళ్ల క్రితం జరిగిన ఘటన అని వెల్లడించింది. ఉర్ఫీ జావేద్ 9 సంవత్సరాల తర్వాత తన లిప్ ఫిల్లర్లను కరిగించుకున్నానని తెలిపింది. ఉబ్బిన పెదవులు, వాచిన ముఖానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. తనకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వైద్యుడు ఈ ప్రయోగం చేసాడు. కానీ అది వికటించింది. పెదవి లావుగా ఉబ్బింది. ఇంత కాలానికి కానీ అవన్నీ కరిగి సెట్ రైట్ కాలేకపోయానని ఊర్ఫీ ఆవేదన చెందింది. ఫిల్లర్లను కరిగించడానికి ముందు, తరువాత కూడా తన ముఖం ఎలా వాచిందో వీడియోలో కనిపించింది. ఇది నా బాధ అనుకుని ఈ వీడియోని చూడాల్సిందిగా రెక్వస్ట్ చేసింది ఊర్ఫీ. కృత్రిమ పద్ధతిని ఆశ్రయించి తప్పు చేసానని గమనించిన ఊర్ఫీ, ఆ తర్వాత సహజంగానే ప్రయత్నించి సక్సెసయ్యానని చెప్పింది.
నా పెదవులు వెంటనే ఉబ్బిపోయాయి.. ముఖం వాచిపోయింది. నన్ను నేను చూసుకుని నవ్వుకున్నాను. చివరికి, నా పరిస్థితి చాలా దారుణంగా మారింది.. ఇది ఫిల్లర్ కాదు.. అవి వికటించాయి. దాంతో వాటిని కరిగించాలని నిర్ణయించుకున్నాను.. అని కూడా ఊర్ఫీ చెప్పింది. ఫిల్లర్ల కోసం మంచి వైద్యుడి వద్దకు వెళ్లడం చాలా ముఖ్యం. ఫ్యాన్సీ క్లినిక్‌లు ఉన్న ఈ వైద్యులందరికీ ఏమీ తెలియదు అని కూడా డాక్టర్లపై ఊర్ఫీ విరుచుకుపడింది. 18ఏళ్ల తర్వాత తన లిప్ ఫిల్లర్లను తొలగిస్తున్నారని కూడా ఊర్ఫీ వెల్లడించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే ఊర్ఫీ ఇటీవల ఓటీటీ షో ట్రెయిటర్స్ విజేతగా నిలిచింది.
