Begin typing your search above and press return to search.

ఉపేంద్ర.. ఈ వాడకం ఏంటి సామీ!

అందులో ముఖ్యంగా ఉపేంద్ర - A లాంటి సినిమాలు ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   5 March 2024 9:45 AM GMT
ఉపేంద్ర.. ఈ వాడకం ఏంటి సామీ!
X

కన్నడ సంచలన నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ హీరో తెలుగులో కూడా మంచి గుర్తింపునందుకున్నాడు. అతను డైరెక్ట్ చేసి నటించిన కొన్ని సినిమాలు ఇప్పటికీ కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఉపేంద్ర - A లాంటి సినిమాలు ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు అతని నుంచి యుఐ(UI) అనే సినిమా రాబోతోంది. ఉపేంద్ర చాలా రోజులలో తర్వాత డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్ తో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ప్రమోషన్స్ ద్వారానే ఉపేంద్ర మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఒక పాట ఇటీవల విడుదల చేశారు. అందులో పొలిటికల్ అలాగే సినిమాలలో బాగా వైరల్ అయిన డైలాగ్స్ ను కూడా వాడడం విశేషం.

సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయిన వారి పేర్లు కూడా రావడం మరింత హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా రాజకీయ నాయకుల డైలాగ్స్ కూడా గట్టిగానే వాడారు. ఈ సినిమాకు కాంతార ఫేమ్ ఆజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. ఇటీవల విడుదల చేసిన పాట వివరాల్లోకి వెళితే ముందుగా.. పవన్..మనల్ని ఎవడురా ఆపేది అనే డైలాగ్ తో పాటు కాకుండా వైఎస్ జగన్ నేను ఉన్నానంటూ ముద్దులు ఇచ్చే సన్నివేశంను కూడా హైలెట్ చేశారు.

కుర్చీ మడత పెట్టి అంటూ చంద్రబాబు వాడిన డైలాగ్ కూడా బాగా వైరల్ అయింది. మల్లారెడ్డి పూలు అమ్మిన పాలు అమ్మిన అనే డైలాగ్ కూడా ఈ పాట రచనలో ఉండడం విశేషం. ఇక షర్మిల పాదయాత్రకు సంబంధించిన డైలాగ్స్ కూడా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ ఎన్నోన్నో అనుకుంటాం.. త్రివిక్రమ్.. రెండు చేతులో జేబులో పెట్టుకొని.. అనే డైలాగ్స్ కూడా వాడేశారు.

చూస్తుంటే పాటతోనే మంచి హైప్ క్రియేట్ చేసేలా ఉన్నారని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ పాట సినిమాలో ఎలాంటి సందర్భంలో వస్తుందో చూడాలి అనే కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఉపేంద్ర మరోసారి తన స్టైల్ వేరు అనేలా ప్రమోషన్స్ చేస్తున్నాడు. కంటెంట్ జనాల్లోకి వెళ్లేలా తెలివిగా క్రియేట్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ రాబోయే అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి.