Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో నెక్ట్స్ పెద్ద సినిమాల రిలీజులివే!

గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో మొద‌లైన ఈ ఏడాది ఇప్ప‌టికే ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లను అందుకోగా, మ‌రికొన్ని యావ‌రేజ్ ఫ‌లితాల‌ను, ఇంకొన్ని ఫ్లాపు సినిమాల‌ను అందుకుంది.

By:  Tupaki Desk   |   11 April 2025 10:00 PM IST
టాలీవుడ్‌లో నెక్ట్స్ పెద్ద సినిమాల రిలీజులివే!
X

గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో మొద‌లైన ఈ ఏడాది ఇప్ప‌టికే ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లను అందుకోగా, మ‌రికొన్ని యావ‌రేజ్ ఫ‌లితాల‌ను, ఇంకొన్ని ఫ్లాపు సినిమాల‌ను అందుకుంది. ఆల్రెడీ ఏప్రిల్ నెల కూడా స‌గానికొచ్చింది. ఇక టాలీవుడ్ లో త‌ర్వాత రానున్న సినిమాలేంటి? ఎప్పుడు ఏ హీరో సినిమాలు రిలీజ‌వుతున్నాయ‌నేది చూద్దాం.

ముందుగా 2025లో...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా మే 9న రిలీజ్ కానుంది.

ధ‌నుష్, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న కుబేర మూవీ జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మంచు విష్ణు హీరోగా ప్ర‌భాస్ క్యామియో చేస్తున్న క‌న్న‌ప్ప జూన్ 27న రిలీజవుతోంది. ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్, మోహ‌న్ లాల్, మోహ‌న్ బాబు, కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా న‌టించారు.

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న మాస్ జాత‌ర సినిమా జులై 18న విడుద‌ల కానుంది.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర జులై 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

జూ. ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ క‌లిసి న‌టించిన వార్2 సినిమా ఆగ‌స్ట్ 14న రిలీజ్ కానుంది.

బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న అఖండ‌2 సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల కానుంది. అదే రోజున సాయి ధ‌ర‌మ్ తేజ్ సంబ‌రాల ఏటి గ‌ట్టును రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

2026లో..

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మెగా 157 సినిమా జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది.

జూ. ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది.

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమా మార్చి 27 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది.

ఇక 2027లో యావత్ ప్ర‌పంచం ఎదురుచూస్తున్న మ‌హేష్ బాబు, రాజ‌మౌళి సినిమా మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప్ర‌స్తుతానికి ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. రానున్న రోజుల్లో వీటితో పాటూ మ‌రికొన్ని కొత్త‌ సినిమాలు యాడ్ కానున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ వాయిదా ప‌డే ఛాన్స్ కూడా లేక‌పోలేదు. మొత్తానికి రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి చాలానే క్రేజీ సినిమాలు రానున్నాయి.