150 అనాధ ఆశ్రమాలను దత్తత తీసుకున్న మెగా కోడలు!
మెగా కోడలు ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎంతో చొరవ చూపిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా వీలైనంత వరకూ అవేర్ నేస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు.
By: Tupaki Desk | 16 July 2025 5:53 PM ISTమెగా కోడలు ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎంతో చొరవ చూపిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా వీలైనంత వరకూ అవేర్ నేస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తి త్వ వికాసానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతుంటారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి విషయాలపట్ల మరింత చురుకుగా పనిచేస్తున్నారు. తాజాగా ఉపాసన ఏకంగా 150 అనాధ ఆశ్రమాలను దత్తత తీసుకున్నారు. ఇక నుంచి వాటి బాద్యత మొత్తం ఉపాసన చూసుకుంటారు.
అనాధ బాలలు, వృద్ధులు పట్ల సహృదయంతో ఉపాసన ముందుకు కదలడం అన్నది ఎంతో గొప్ప విష యం. వాళ్లతో ఉపాసన మేమేకమవుతోన్న తీరు చూస్తుంటే? ఉపాసన మనసు ఎంత గొప్పదన్నది హైలైట్ అవుతుంది. 150 అనాధ శ్రమాల్లో వాళ్లకు కావాల్సిన అన్ని రకాల మౌళిక వసతులు కల్పిస్తున్నారు. అలాగే పండగలు..పబ్బాలు సమయంలో కూడా ఉపాసన ప్రత్యేకంగా ఇకపై పర్యటించే అవకాశం ఉంది.
అనాధలంటే ఎవరూ లేని వారు కాబట్టి తమకు తోడుగా తాను ఉన్నానని భరోసా అన్ని రకాలుగా కల్పి స్తున్నారు. ఇప్పటికే అపోలా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా 150 ఆశ్రమాలు కూడా తోడవ్వడంతో ఉపాసన మరింత బిజీగా ఉండనున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివిటీ కూడా తగ్గించారు. చరణ్ కుసంబంధించిన విషయమో...అత్తమ్మకు సంబంధిం చిన విషయాలు అప్పుడప్పుడు పంచుకునేవారు.
కానీ ఇప్పుడు అవి కూడా తగ్గాయి. అపోలా సహా సేవా కార్యక్రమాల్లో మరింత బిజీ అవ్వడంతోనే ఇంటి విషయాలకు ప్రాధాన్యత తగ్గించినట్లు కనిపిస్తుంది. ఉపాసన చేస్తోన్న ఈ సేవా కార్యక్రమాల విషయంలో రామ్ చరణ్ ఎంతో గర్విస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లండ్ బ్యాక్ పేరిట పలు సేవా కార్యక్రమాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
