Begin typing your search above and press return to search.

స‌గం పూర్త‌యిన త‌ర్వాత హీరోయిన్ ఎంట్రీ!

ఇప్ప‌టికే ఇందులో ఓ హీరోయిన్ గా ప్ర‌గ్యాజైశ్వాల్ న‌టిస్తుంది. అయితే తాజాగా యూత్ ఐకాన్ గా మారిన నేహాశెట్టిని తీసుకున్న‌ట్లు స‌మాచారం.

By:  Tupaki Desk   |   5 Feb 2024 7:33 AM GMT
స‌గం పూర్త‌యిన త‌ర్వాత హీరోయిన్ ఎంట్రీ!
X

బెల్లంకొండ సాయి శ్రీన‌వాస్ స‌క్సెస్ కోసం పోరాటం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా స‌రైన విజ‌యం ఒక్క‌టీ లేక‌పోవ‌డంతో ఇప్పుడా స‌క్సెస్ ఎంత వేగంగా వ‌స్తుందా? అని ఎదురుచూస్తున్నాడు. అందుకే క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుల్ని సైతం ప‌క్క‌న‌బెట్టి సాగ‌ర్ చంద్ర అనే ఇన్నోవేటివ్ డైరెక్ట‌ర్ ని తెర‌పైకి తెచ్చాడు. కంటెంట్ బేస్ట్ చిత్రాల‌కు ఇటీవ‌లి కాలంలో మంచి విజ‌యం సాధిస్తున్నాయి.


ఆ జాన‌ర్ క‌థ‌లు తెర‌కెక్కించ‌డంలో సాగ‌ర్ చంద్ర స్పెష‌లిస్ట్. ఇంత‌కాలం అత‌ని క‌థ‌లు క‌మ‌ర్శియ‌ల్ గా పెద్ద‌గా వ‌ర్కౌట్ కాన‌ప్ప‌టికీ మారుతోన్న ప్రేక్ష‌కుల అభిరుచి నేప‌థ్యంలో అత‌డికి క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలో బెల్లంకొండ ఎంతో మంది ద‌ర్శ‌కుల్ని ప‌క్క‌న‌బెట్టి క్రియేటివ్ మేక‌ర్ ని సీన్ లోకి తెచ్చాడు. ప్ర‌స్తుతం ఇద్ద‌రి కాంబినేష‌న్ లో 'టైస‌న్ నాయుడు' అనే చిత్రం తెర‌కెక్కుతోంది.

ఇప్ప‌టికే ఇందులో ఓ హీరోయిన్ గా ప్ర‌గ్యాజైశ్వాల్ న‌టిస్తుంది. అయితే తాజాగా యూత్ ఐకాన్ గా మారిన నేహాశెట్టిని తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఆమెనే మెయిన్ లీడ్ గా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌గ్యా క‌న్నా నేహాశెట్టికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. 'డీజేటిల్లు'తో ఆమె ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే. రాధిక అక్క‌గా కుర్రాళ్ల మ‌న‌సుల్ని దొచేసింది. ఆ త‌ర్వాత న‌టిగానూ బిజీ అయింది.

ఈ నేప‌థ్యంలో బెల్లంకొండ‌కి జోడీగా నేహాని ఎంపిక‌చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ సంగం పూర్త‌యింది. ఆమె ఎంట్రీ క‌న్ప‌మ్ అయితే గ‌నుక మ‌ధ్య‌లో నేహాశెట్టి జాయిన్ అవుతు న్న‌ట్లు. అయితే నేహానికి తెర‌పై ఎంత అందంగా చూపించాం? అన్న‌ది కీల‌కం కానుంది. నేహా శెట్టి అంటే యూత్ ఎక్స్ ప‌క్టేష‌న్స్ భారీగానే ఉంటాయి. మ‌రి సాగ‌ర్ చంద్ర నేహాశెట్టిని వాళ్లు అనుకున్న‌ట్లు చూపి స్తాడా? త‌న‌కు న‌చ్చిన‌ట్లు హైలైట్ చేస్తాడా? అన్న‌ది చూడాలి.