Begin typing your search above and press return to search.

తికమక మకతిక గురూజి ప్లాన్..!

గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి.. గురూజీ నెక్స్ట్ సినిమా హీరో ఎవరు లాంటి ప్రశ్నలతో సోషల్ మీడియా అంతా ఒకటే హడావిడి నడుస్తుంది

By:  Tupaki Desk   |   19 Feb 2024 2:34 PM GMT
తికమక మకతిక గురూజి ప్లాన్..!
X

గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి.. గురూజీ నెక్స్ట్ సినిమా హీరో ఎవరు లాంటి ప్రశ్నలతో సోషల్ మీడియా అంతా ఒకటే హడావిడి నడుస్తుంది. మహేష్ గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో సినిమా లాక్ చేసుకున్నాడు గురూజీ. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఆగష్టు లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత సినిమా ఉంటే ఉంటుంది. అయితే త్రివిక్రమ్ కన్నా ముందు తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తున్నాడట అల్లు అర్జున్.

అందుకే త్రివిక్రం తన ప్లాన్ మార్చుకున్నాడని అంటున్నారు. స్టార్స్ అంతా తమ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల త్రివిక్రమ్ కి హీరోలు దొరకట్లేదు. టైర్ 2 హీరోలతో చేయాలనే ఆలోచన ఉన్నా దానికి ఎందుకో త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట త్రివిక్రం. సడెన్ గా విజయ్ ఎలా సీన్ లోకి వచ్చాడు అంటే డివివి దానయ్య నిర్మాణంలో విజయ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమా డైరెక్షన్ ఛాన్స్ త్రివిక్రమ్ అందుకున్నాడని అంటున్నారు. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ న్యూస్ రాలేదు. అటు తెలుగు యువ హీరో ఇటు కోలీవుడ్ స్టార్ హీరో ఈ ఇద్దరిలో త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది కన్ ఫ్యూజన్ గా ఉంది. కోలీవుడ్ హీరో సూర్యతో త్రివిక్రమ్ సినిమా చేయాలని కొన్నేళ్లుగా డిస్కషన్స్ లో ఉంది. అప్పటి నుంచి అది కుదరలేదు.

విజయ్ తో సినిమా సెట్ అవ్వకపోయినా త్రివిక్రమ్ తో అంటే సూర్య కూడా లైన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తెలుగు యంగ్ హీరోతో కన్నా కోలీవుడ్ స్టార్ తో త్రివిక్రం సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అయితే త్రివిక్రమ్ నెక్స్ట్ పై ఈ తికమక వ్యవహారం ఫ్యాన్స్ ని కూడా ఇబ్బంది పెడుతుంది. లేటెస్ట్ గా త్రివిక్రమ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వనున్నాడని చెప్పుకుంటున్నారు. డైరెక్షన్ పక్కన పెట్టి కేవలం ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో ఏది నిజం అన్నది త్వరలో తెలుస్తుంది. త్రివిక్రమ్ ప్లాన్ ఏదైనా కూడా ఈసారి తన పెన్ పవర్ తో తిరిగి సూపర్ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు గురూజీ.