Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు హీరోలకు లక్కీ ఛార్మ్ గా మారిన స్టార్ హీరోయిన్.. నెటిజన్ పోస్ట్ కి రియాక్షన్!

ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ త్రిష పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Madhu Reddy   |   25 May 2026 12:42 PM IST
ఆ ముగ్గురు హీరోలకు లక్కీ ఛార్మ్ గా మారిన స్టార్ హీరోయిన్.. నెటిజన్ పోస్ట్ కి రియాక్షన్!
X

సాధారణంగా ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరో సినిమాలో నటించి.. అది హిట్ అయింది అంటే సహజం అనుకుంటారు. కానీ ఆ హీరోయిన్ మిగతా హీరోల సినిమాలలో కూడా నటించి మంచి విజయాలను అందుకుంటే మాత్రం ఆ హీరోలకి ఈ హీరోయిన్ లక్కీ లేడీ అంటారనడంలో సందేహం లేదు .అలా ఇదివరకే ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకున్న శృతిహాసన్ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి గోల్డెన్ లేడీగా పేరు సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన మీనాక్షి చౌదరి కూడా అంతే .. ఆమె నటించిన ప్రతి సినిమా కూడా విజయం సాధించడంతో అందరూ ఆమెను లక్కీ ఛార్మ్ అంటూ పొగిడారు.




ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ త్రిష పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆ ముగ్గురు హీరోలకు లక్కీ లేడీ అంటూ ఒక నెటిజన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా దీనిని త్రిష రీ పోస్ట్ చేసింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరోస్ బ్లాక్ బస్టర్ మూవీలలో ఈమె భాగం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే ఒక అభిమాని చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో దీనిని ఆమె షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో ప్రస్తుత తమిళనాడు సీఎం, కోలివుడ్ స్టార్ హీరో విజయ్ తో లియో సినిమాలో త్రిష నటించింది. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. అంతేకాదు విజయ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. త్రిష నటించిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత 2025లో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా రూ.248 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అజిత్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్ మూవీగా నిలిచింది.

ఈ రెండు చిత్రాల ఫలితాలను కాస్త పక్కన పెడితే..తాజాగా కోలీవుడ్ మరో స్టార్ హీరో సూర్యతో కరుప్పు సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న సూర్య ఈ కరుప్పు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే . అలా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు సుమారుగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది .

ఈ మూడు సినిమాల ఫలితాలను బట్టి చూస్తే.. ఇక్కడ సక్సెస్ కోసం ఆరాటపడుతున్న హీరోల సినిమాలలో త్రిష హీరోయిన్ గా నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది ..ఇక అందుకే ఈ ముగ్గురు హీరోలకు ఈమె లక్కీ ఛార్మ్ అంటూ నెటిజన్ పోస్ట్ పెట్టడంతో దానిని తన ఇన్ స్టా స్టోరీ లో పంచుకుంటూ ఆమె ధన్యవాదాలు తెలిపింది. మరోవైపు ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.