Begin typing your search above and press return to search.

తారక్ మూవీ.. మాలీవుడ్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ..

అయితే ఇప్పుడు తారక్ మూవీతో మాలీవుడ్ కు చెందిన స్టార్ నటుడు.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2025 5:47 PM IST
తారక్ మూవీ.. మాలీవుడ్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ..
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చివరగా.. దేవర మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు తన బాలీవుడ్ డెబ్యూ వార్-2 సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 14న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది ఆ మూవీ.

అదే సమయంలో ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యస్వామి కథతో మూవీ రూపొందనుందని క్లారిటీ వచ్చేసింది.

తారక్ లైనప్ లో దేవర సీక్వెల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా రద్దు అయిందని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా మూవీ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తారక్ మూవీతో మాలీవుడ్ కు చెందిన స్టార్ నటుడు.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఆయన ఎవరో కాదు.. టోవినో థామస్.. ఇప్పటికే వివిధ మాలీవుడ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు టోవినో. ఇప్పటి వరకు టాలీవుడ్ మూవీస్ లో యాక్ట్ చేయనప్పటికీ.. కేవ‌లం ఓటీటీల ద్వారా వ‌చ్చిన మ‌ల‌యాళ సినిమాల‌తోనే క్రేజ్ సొంతం చేసుకున్నారు. వివిధ సినిమాలతో అందరినీ మెప్పించారు.

2018, ఏఆర్ఎం వంటి పలు సినిమాలు ఆయన వల్లే తెలుగులో కూడా రాణించాయని చెప్పాలి. ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ విషయంపై రూమర్స్ వినిపించినప్పటికీ.. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఆ మ్యాటర్ ను మరో మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు.

టోవినోతోపాటు మరో యాక్టర్ బిజు మీనన్ కీలక పాత్రలో నటించనున్నట్లు చెప్పారు. అంతే కాదు.. వాళ్లిద్దరూ ఫుల్ టాలెంటెడ్ అని.. కాబట్టి నీల్ అద్బుతమైన రోల్స్ ఇచ్చి ఉంటారని తెలిపారు. వాళ్ల రోల్స్.. సినిమాకే కీలకంగా నిలుస్తాయని అంచనా వేశారు. అయితే బిజు మీనన్.. ఇప్పటికే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. గోపీచంద్ రణం సినిమాలో యాక్ట్ చేశారు. మరి ఇప్పుడు టోవినోతో కలిసి తారక్ మూవీలో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.