ఆ చిన్న సినిమా ముందు సూర్య మూవీ తేలిపోయిందిగా
చిన్న సినిమా అయినా కంటెంట్ బావుంటే దాన్ని సూపర్ హిట్ చేస్తున్న ఆడియన్స్, అదే కంటెంట్ లేకపోతే ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నా దాన్ని లైట్ తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 19 May 2025 10:54 AM ISTఒకప్పుడంటే చిన్న సినిమాలను తక్కువ చూపు చూసి అసలు ఆ సినిమా వచ్చిందని కూడా తెలియక స్టార్ హీరోలు నటించిన సినిమాలు అందరికీ తెలియడంతో ఎలా ఉన్నా ఆడేవి కానీ ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏ సినిమా బావుంది, ఏ సినిమా బాలేదనే విషయం క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది.
చిన్న సినిమా అయినా కంటెంట్ బావుంటే దాన్ని సూపర్ హిట్ చేస్తున్న ఆడియన్స్, అదే కంటెంట్ లేకపోతే ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నా దాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్టర్ గా పూజా హెగ్డే, నాజర్, జోజు జార్జ్ లాంటి భారీ క్యాస్టింగ్ తో రెట్రో అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు, పూజాకు రెట్రో మంచి ఫలితాన్నిస్తుందని ఎంతో ఆశపడ్డారు. రిలీజ్ కు ముందు ఈ సినిమా గురించి కోలీవుడ్ మీడియా, సూర్య ఫ్యాన్స్ ఎంతో గొప్పగా చెప్పారు. కానీ రిలీజ్ రోజే సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. తెలుగు ఆడియన్స్ అయితే రెట్రో చూసి మాకేంటిది అని తలలు పట్టుకుని థియేటర్ల నుంచి బయటకు కూడా వచ్చేశారు.
తమిళనాడు లో మొదటి వారం ఫర్వాలేదనిపించిన రెట్రో అక్కడ కూడా ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టుకుంది. రెట్రోతో పాటూ రిలీజైన టూరిస్ట్ ఫ్యామిలీ అనే చిన్న సినిమా రెట్రో మూవీ కలెక్షన్లకు చెక్ పెట్టింది. డైరెక్టర్ శశి కుమార్, సిమ్రన్ కీలక పాత్రలు పోషించిన టూరిస్ట్ ఫ్యామిలీ స్టార్ క్యాస్టింగ్ లేకపోయినప్పటికీ కంటెంటే స్టార్ గా నిలబడి ఆడియన్స్ ను బాగా అలరించింది.
అభిషన్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ టూరిస్ట్ ఫ్యామిలీ రిలీజ్ కు ముందే ప్రివ్యూల నుంచి చాలా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత దానికి మౌత్ టాక్ కూడా యాడ్ అవడంతో క్రమంగా కలెక్షన్లు కూడా పెరిగాయి. క్రమంగా సినిమా చూడాలనుకుంటున్న వారికి ఆప్షన్ గా టూరిస్ట్ ఫ్యామిలీ మారింది. మొదటి రోజు రూ.రెండున్నర కోట్లతో మొదలైన టూరిస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు రూ.60 కోట్లు క్రాస్ చేసింది. తమిళనాడులో సూర్య సినిమా కంటే టూరిస్ట్ ఫ్యామిలీనే ఎక్కువ కలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
