Begin typing your search above and press return to search.

టాప్ 10 : బుక్‌మై షో లో హైయెస్ట్‌ ఇంట్రెస్ట్‌ మూవీస్‌

ప్రస్తుతం బుక్‌ మై షో లో హైయెస్ట్‌ ఇంట్రెస్ట్‌లను సొంతం చేసుకుంటున్న బాలీవుడ్‌ సినిమాల జాబితాలో 'వార్‌ 2' నెం.1 స్థానంలో ఉంది.

By:  Tupaki Desk   |   10 April 2025 9:41 AM
టాప్ 10 : బుక్‌మై షో లో హైయెస్ట్‌ ఇంట్రెస్ట్‌ మూవీస్‌
X

ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ యాప్‌ బుక్ మై షోలో ప్రేక్షకుల అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటారు. రాబోయే సినిమాల్లో ఏ సినిమాను మీరు చూడాలి అనుకుంటున్నారు, ఏ సినిమా పట్ల మీరు ఆసక్తిగా ఉన్నారు అనే విషయాన్ని బుక్‌ మై షో ద్వారా తెలియజేయవచ్చు. బుక్‌ మై షోలో హైయెస్ట్‌ ఇంట్రెస్ట్‌ మూవీస్‌ జాబితాను చూసినట్లయితే స్టార్‌ హీరోల సినిమాలు, సీక్వెల్‌కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్‌ సినిమాలతో పోల్చితే సౌత్‌ సినిమాలు అత్యధిక ఇంట్రెస్ట్‌లను కలిగి ఉంటాయి. టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు లక్షల్లో ఇంట్రస్ట్‌లు నమోదు కావడం మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం బుక్‌ మై షో లో హైయెస్ట్‌ ఇంట్రెస్ట్‌లను సొంతం చేసుకుంటున్న బాలీవుడ్‌ సినిమాల జాబితాలో 'వార్‌ 2' నెం.1 స్థానంలో ఉంది.

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'వార్‌' కి సీక్వెల్‌గా 'వార్‌ 2' రూపొందుతోంది. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న వార్‌ 2 సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో పాటు, టాలీవుడ్‌ స్టార్‌ హీరో కలిసి నటిస్తున్న కారణంగా వార్‌ 2 కి బుక్ మై షో లో ఇప్పటి వరకు 61.7 వేల ఇంట్రెస్ట్‌లు నమోదు అయ్యాయి. వార్‌ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టులో విడుదల కాబోతున్న వార్‌ 2 లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

వార్ 2 తర్వాత అజయ్ దేవగన్‌ నటించిన 'రైడ్‌ 2' నిలిచింది. 41 వేల ఇంట్రెస్ట్‌లతో రైడ్‌ 2 సినిమా నెం.2 స్థానంలో నిలిచింది. మే లో విడుదల కాబోతున్న రైడ్ 2 కి బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ఈ స్థానం ఆధారంగా చెప్పవచ్చు. విడుదల సమయం వరకు ఈ ఇంట్రెస్ట్‌ల నెంబర్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న వెల్‌ కమ్‌ బ్యాక్‌ టు జంగిల్‌ సినిమా ఉంది. ఈ సినిమా అక్షయ్‌ సూపర్‌ హిట్‌ కామెడీ ప్రాంచైజీ నుంచి రాబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు బుక్ మై షో లో దాదాపుగా 40 వేల ఇంట్రెస్ట్‌లు నమోదు అయ్యాయి.

ఆ తర్వాత వరుసగా హౌస్‌ఫుల్‌ 5 (33.3 వేలు), కేసరి చాప్టర్ 2 (16.1 వేలు), భాఘీ 4 (13 వేలు), ధడక్‌ 2 (11.4 వేలు), ది బూత్‌ ని (10 వేలు), తేరే ఇస్క్‌ మైన్‌ (9.8 వేలు) సినిమాలు టాప్‌ 10 లో చోటు దక్కించుకున్నాయి. బుక్ మై షో లో ఆధారంగానే సినిమాల ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ఉంటాయనే అభిప్రాయం ఉంది. బుక్‌ మై షో లో నమోదు అవుతున్న ఇంట్రెస్ట్‌లు విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది పెరుగుతూ ఉంటాయి. టాప్‌ 10 జాబితాను చూస్తే ఎక్కువ శాతం సీక్వెల్స్‌కి, ప్రాంచైజీ సినిమాలకు ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతుంది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది చూడాలి.