Begin typing your search above and press return to search.

2025 బాలీవుడ్ సినిమాల్లో బుక్‌మైషో ఇంట్రెస్ట్ హవా: టాప్ 10 లిస్ట్ ఇదే!

బుక్‌మైషోలో అత్యధిక ఇంట్రెస్ట్ సాధించిన సినిమాల లిస్ట్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ 2' టాప్‌లో నిలిచింది.

By:  Tupaki Desk   |   8 May 2025 10:32 AM
2025 బాలీవుడ్ సినిమాల్లో బుక్‌మైషో ఇంట్రెస్ట్ హవా: టాప్ 10 లిస్ట్ ఇదే!
X

2025లో పలు క్రేజీ బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది విడుదల కానున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ప్రతీ ఒక్కటి డిఫరెంట్ కంటెంట్ తో రూపొందుతున్నవే. బుక్‌మైషోలో అత్యధిక ఇంట్రెస్ట్ సాధించిన సినిమాల లిస్ట్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ 2' టాప్‌లో నిలిచింది.

ఈ లిస్ట్‌లో 'భూల్ చుక్ మాఫ్', 'వెల్‌కమ్ టు ది జంగిల్', 'హౌస్‌ఫుల్ 5' లాంటి సినిమాలు కూడా ఆకర్షిస్తున్నాయి. బుక్‌మైషోలో అత్యధిక ఇంట్రెస్ట్ సాధించిన సినిమాల్లో 'వార్ 2' 66.8K ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఆగస్టు 14, రిలీజ్ కానున్న ఈ సినిమా, 'వార్' ఫ్రాంచైజీలో రెండో భాగం.

ఈ సినిమాలో హృతిక్ రోషన్ మేజర్ కబీర్ ధలివాల్‌గా కనిపిస్తాడు, ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంటాడని టాక్. ఈ సినిమా ట్రైలర్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండో స్థానంలో 'భూల్ చుక్ మాఫ్' 55K ఓట్లతో నిలిచింది. మూడో స్థానంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్‌కమ్ టు ది జంగిల్' 40.4K ఓట్లతో, నాల్గవ స్థానంలో 'హౌస్‌ఫుల్ 5' 37.4K ఓట్లతో ఉన్నాయి.

'కేసరి వీర్' 18.8K ఓట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సినిమాలు బాలీవుడ్‌లో కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లలో రాబోతున్నాయి. 'వెల్‌కమ్ టు ది జంగిల్', 'హౌస్‌ఫుల్ 5' సినిమాలు అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను అలరించే అవకాశం ఉంది. జాబితాలో మిగతా సినిమాలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 'బాఘీ 4' 14.6K ఓట్లతో ఆరో స్థానంలో, 'ధడక్ 2' 11.6K ఓట్లతో ఏడో స్థానంలో, 'తేరే ఇష్క్ మే' 11K ఓట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. 'ఆల్ఫా' 4.9K ఓట్లతో తొమ్మిదో స్థానంలో, 'దే దే ప్యార్ దే 2' 4.3K ఓట్లతో పదో స్థానంలో నిలిచాయి.

బుక్‌మైషోలో అత్యధిక ఇంట్రెస్ట్ గల సినిమాల జాబితా (2025 బాలీవుడ్):

- వార్ 2: 66.8K

- భూల్ చుక్ మాఫ్: 55K

- వెల్‌కమ్ టు ది జంగిల్: 40.4K

- హౌస్‌ఫుల్ 5: 37.4K

- కేసరి వీర్: 18.8K

- బాఘీ 4: 14.6K

- ధడక్ 2: 11.6K

- తేరే ఇష్క్ మే: 11K

- ఆల్ఫా: 4.9K

- దే దే ప్యార్ దే 2: 4.3K