స్టార్ హీరోలకు హెల్పింగ్ హ్యాండ్స్!
గెస్ట్ రోల్ పోషించమన్నా? మరో మాట లేకుండా కమిట్ అవుతున్నారు. సదరు హీరోకు సహకారంగా నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 26 April 2025 12:00 AM ISTటాలీవుడ్ లో సినిమా ట్రెండ్ మారిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ గెస్ట్ అపిరీయన్స్ ఇవ్వడం..మల్టీస్టారర్ చిత్రాల్లో స్టార్స్ కలిసి నటించడం వంటివి టాలీవుడ్ లో కామన్ గా మారింది. ఇతర భాషల హీరోలు సైతం తెలుగు స్టార్స్ తో చేతులు కలుపుతున్నారు. ఇక తెలుగు హీరోల మధ్య సఖ్యత గురించైతే చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ మల్టీస్టారర్ అంటూ హీరోలు దూసుకొస్తున్నారు.
గెస్ట్ రోల్ పోషించమన్నా? మరో మాట లేకుండా కమిట్ అవుతున్నారు. సదరు హీరోకు సహకారంగా నిలుస్తున్నారు. తాజాగా అలాంటి కాంబినేషన్లు కొన్ని వెండి తెరకు రెడీ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో తొలుత విక్టరీ వెంకటేష్ లేరు. కానీ ఇప్పుడాయన భాగమవుతున్నారు.
ఇందులో వెంకీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న `కూలీ`లో ఉపేంద్ర, నాగార్జునలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ త్రయం చేతులు కలపడం ఇదే తొలిసారి. అలాగే రజనీ లైనప్ లో ఉన్న మరోఉ చిత్రం `జైలర్ 2`లో నూ స్టార్ హీరోలు నటిస్తున్నారు. శివన్న, మోహన్ లాల్, బాలకృష్ణ, పహాద్ పాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
`సలార్ -2`లోనూ యధావిధిగా మాలీవుడ్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ స్నేహితుడి పాత్రలో కంటున్యూ అవుతాడు. `కల్కి2898` లో ప్రభాస్ కోసం అమితాబచ్చన్ నటించిన సంగతి తెలిసిందే. `కల్కి 2`లోనూ బిగ్ బీ కొనసాగుతారు. అలాగే బాలీవుడ్ చిత్రం `వార్ 2` లో హృతిక్ రోషన్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. తారక్ హీరో రోల్ కాకపోయినా? కీలక పాత్రకు ఒకే చెప్పి ముందుకెళ్తున్నారు. అలా స్టార్ హీరోల చిత్రాల్లో మరో స్టార్ హీరో కూడా భాగమై తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.
