Begin typing your search above and press return to search.

నెక్ట్స్ 3 వీక్స్.. తెలుగు ఆడియ‌న్స్ కు పండ‌గే!

అయితే ఇప్పుడు వారి నిరీక్ష‌ణ‌కు తెర ప‌డ‌బోతుంది. దానికి కార‌ణం మ‌రికొన్ని రోజుల్లోనే టాలీవుడ్ లో ప‌లు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   18 July 2025 11:00 PM IST
నెక్ట్స్ 3 వీక్స్.. తెలుగు ఆడియ‌న్స్ కు పండ‌గే!
X

నిన్న కాక మొన్న కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చిన‌ట్టుంది. కానీ అప్పుడే 2025లో స‌గంకు పైగా అయిపోయింది. మామూలుగా అయితే గ‌త 6 నెల‌ల్లో ఎన్నో పెద్ద సినిమాలు రిలీజ‌వాల్సింది కానీ షూటింగ్ లో జాప్యం, వీఎఫ్ఎక్స్, మ‌రికొన్ని ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల పెద్ద హీరోల సినిమాలేవీ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. దీంతో తెలుగు ఆడియ‌న్స్ పెద్ద సినిమాల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు వారి నిరీక్ష‌ణ‌కు తెర ప‌డ‌బోతుంది. దానికి కార‌ణం మ‌రికొన్ని రోజుల్లోనే టాలీవుడ్ లో ప‌లు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాదాపు మూడు వారాల టైమ్ లో టాలీవుడ్ నుంచి నాలుగు పెద్ద పాన్ ఇండియా సినిమాలు రానున్నాయి. దీంతో తెలుగు ఆడియ‌న్స్ ఎప్పుడెప్పుడు ఆ సినిమాల‌ను చూద్దామా అని ఎంతో ఆతృత‌తో ఉన్నారు.

జులై 24న ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుతో ఈ హంగామా మొద‌లు కానుంది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి, ఏఎం జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన వీర‌మ‌ల్లు ఎన్నో వాయిదాల త‌ర్వాత జులై 24న రిలీజ్ కానుంది. చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో వీర‌మ‌ల్లుపై భారీ అంచ‌నాలున్నాయి. వీర‌మ‌ల్లు రిలీజైన వారం త‌ర్వాత విజ‌య్ దేవ‌రకొండ కింగ్‌డ‌మ్ సినిమా వ‌స్తోంది.

జులై 31న కింగ్‌డ‌మ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా కోసం ఆడియ‌న్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా నుంచి టీజ‌ర్ వ‌చ్చాక ప్రేక్ష‌కుల్లో కింగ్‌డ‌మ్ పై ఎంతో ఆస‌క్తి పెరిగింది. ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌రో రెండు సినిమాలు ఆగ‌స్టులో రిలీజ్ కానున్నాయి.

అవే వార్2, కూలీ. ఈ రెండు సినిమాలూ ఒకే రోజున ఆగ‌స్ట్ 14న రిలీజ్ కానుండ‌గా రెండింటిపై అంద‌రికీ నెక్ట్స్ లెవెల్ లో అంచ‌నాలున్నాయి. వార్2, కూలీ సినిమాలు ఆడియ‌న్స్ ను భారీగా థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తాయ‌ని అంతా భావిస్తున్నారు. ఈ నాలుగు సినిమాల కోసం ఆడియ‌న్స్ మాత్ర‌మే కాకుండా డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు. మ‌రి ఈ సినిమాలు తెలుగు ఆడియ‌న్స్ ను ఎంత‌లా ఆక‌ట్టుకుంటాయో, ఏ మేర‌కు ఆడియ‌న్స్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తాయో చూడాలి.