మహేష్, బన్నీ ఇక నెక్స్ట్ లెవెల్!
బాహుబలి తరువాతే టాలీవుడ్‌లో భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాతే వందల కోట్ల బడ్జెట్‌తో క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రూపొందడం మొదలైంది.
By: Tupaki Desk | 14 Feb 2026 4:00 AM ISTబాహుబలి తరువాతే టాలీవుడ్‌లో భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాతే వందల కోట్ల బడ్జెట్‌తో క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రూపొందడం మొదలైంది. తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరగడంతో నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్‌తో భారీ ప్రాజెక్ట్‌లు నిర్మించడానికి ధైర్యం చేయడం స్టార్ట్ చేశారు. అలా సాహో, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు నుంచి పుష్ప 2 వంటి రూ.400 కోట్ల బడ్జెట్ సినిమాల వరకు మన నిర్మాతలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
అదే స్థాయిలో రికార్డు స్థాయి లాభాల్ని దక్కించుకున్నారు. ఒకప్పుడు రూ.40, 50 కోట్లతో సినిమా అంటేనే భయపడిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వంద కోట్లు అంటే చాలా సింపుల్‌గా తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వంద కోట్ల బడ్జెట్ అనేది కామన్ అయింది. అయితే ఆ బడ్జెట్ మార్కుని `పుష్ప`, పుష్ప 2తో పాటు ఆర్ఆర్ఆర్, కల్కి2898ఏడీ చిత్రాలు ఎప్పుడో దాటేసి టాలీవుడ్ సినిమాల్లో కొత్త బోర్డర్‌ని సెట్ చేశాయి. అయితే దాన్ని అధిగమించి మహేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుని సరికొత్త టార్గెట్‌లని సెట్ చేస్తుండటం గమనార్హం.
రూ.1000 కోట్లైనా అవలీలగా..
ఒక దశలో రూ.30 నుంచి రూ.50 కోట్లు పెట్టి సినిమాలు తీయడానికే భయపడిన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు రూ.1000 కోట్లైనా అవలీలగా పెట్టడానికి వెనుకాడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో మహేష్ - జక్కన్న కాంబినేషన్‌లో వస్తున్న `వారణాసి`, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కలయికలో రానున్న పాన్ వరల్డ్ మూవీ టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేయబోతున్నాయి. ఇందులో మహేష్ చేస్తున్న `వారణాసి` బడ్జెట్ విషయంలో కావచ్చు.. సినిమా మేకింగ్ విషయంలో కావచ్చు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిబోతోంది. ఈ మూవీని రూ. 1300 కోట్ల బడ్జెట్‌తో అత్యంత భారీ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.
ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్నా కానీ ఫాంటసీ మైథలాజికల్ మూవీగా భారీ స్కేల్‌లో దీన్ని జక్కన్న రూపొందిస్తున్నారు. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం గ్లోబల్‌గా 120 దేశాల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతోంది. త్రేతాయుగానికి సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన హైలైట్. ఈ ఘట్టాల్లో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించి సర్‌ప్రైజ్ చేయనున్నాడు. పరమశివుడిగా ఎవరు కనిసిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ 2027, ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ వరల్డ్ సినిమా...
`పుష్ప ది రూల్` సినిమాతో వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సారి అంతకు మించి అన్నట్టుగా ప్రపంచ స్థాయి మార్కెట్‌పై కన్నేశాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో..భారీ హంగులతో బన్నీ కొత్త సినిమా రాబోతోంది. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న 22వ సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ రూపొందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ చిత్రాల నిర్మాత కళానిధి మారన్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, సైన్స్ ఫిక్షన్ థీమ్..ఇలా పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. దీపికా పదుకునే పోరాట యోధురాలిగా నటిస్తుండగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో కీలక పాత్రలో కనిపించనుంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం హాలీవుడ్‌కు చెందిన స్పెక్ట్రల్ మోషన్ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ అందించనుంది. పలు హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన ప్రముఖ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. `వారణాసి` తరహాలోనే ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. #AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇండియన్ సూపర్ హీరోగా ఇందులో బన్నీ కనిపించనున్నాడు. దీని కోసం భారీ బడ్జెట్‌ని ఖర్చు చేస్తున్నారు. బిజినెస్ కూడా అంతకు మించిన స్థాయిలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఎండ్‌లో కానీ, లేదా వచ్చే ఏడాది ఆగస్టులో కానీ దీన్ని భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ చేరడంతో తాజా విజువల్ వండర్స్‌తో బన్నీ, మహేష్ నెక్స్ట్ లెవెల్ టార్గెట్‌ని సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
