ఆ డైరెక్టర్ మాటలు నాలో కసిని పెంచాయి
సినీ ప్రపంచం చూడ్డానికే రంగుల మయం కానీ అందులో ఉన్న వాళ్లకే దానిలోని అసలైన లోతు తెలుస్తోంది.
By: Tupaki Desk | 9 April 2025 10:00 PM ISTసినీ ప్రపంచం చూడ్డానికే రంగుల మయం కానీ అందులో ఉన్న వాళ్లకే దానిలోని అసలైన లోతు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ పైకి కనిపిస్తున్నంత అందంగా ఏముండదు. సినిమాలను చాలా ఈక్వేషన్స్ నడిపిస్తుంటాయి. ఫామ్ లో ఉన్నప్పుడు ఒకలా ట్రీట్ చేస్తారు. ఆ ఫామ్ లేకపోతే మరోలా ట్రీట్ చేస్తారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా అందరికీ ఒకేలా ఇవ్వరు.
కొన్నిసార్లు వర్క్ చేయించుకుంటారు కానీ దానికి తగ్గ రెమ్యూనరేషన్ మాత్రం ఇవ్వరు. ఎంత అనుభవం ఉన్నా, ఫామ్ లో లేకపోతే వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం అందదు. అలాంటప్పుడు సదరు నటీనటులకు ఎంతో బాధ ఉంటుంది. ఒకప్పుడు తిలోత్తమ షోమ్ సిట్యుయేషన్ కూడా ఇదే. తిలోత్తమ ఇండస్ట్రీకి వచ్చి ఆల్రెడీ రెండున్నరేళ్లవుతోంది.
ఈ రెండున్నర సంవత్సరాల్లో తిలోత్తమ బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ లో ఎన్నో సినిమాలు చేసి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గానే తిలోత్తమ షాడో బాక్స్ అనే సినిమాతో ప్రేక్షకుల్ని అలరించింది. ఇదిలా ఉంటే తాజాగా తిలోత్తమ సినీ ఇండస్ట్రీలో తన ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకుంటూ సడెన్ గా ఏడ్చింది.
తిలోత్తమ నటించిన సినిమాకు గానూ ఓ డైరెక్టర్ తనకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చాడని, ఆ షూటింగ్ అయిపోయాక ఓ పార్టీ జరగ్గా అక్కడ అందరం కలిసి మాట్లాడుకుంటున్న టైమ్ లో ఒకరు నీకు ఏదైనా ఇష్టమా అని అడగ్గా, దానికి అవునని చెప్తూ ఒక కారు పేరు చెప్పి, ఆ కారు రేటుకి సరిపోయే రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు దాన్ని కొంటానని చెప్తుండగా మధ్యలో ఆ డైరెక్టర్ కలుగచేసుకుని నువ్వు ఎప్పటికీ అంత డబ్బు సంపాదించలేవన్నాడని తెలిపింది.
ఇండస్ట్రీలో అలానే ఉంటుందని, టాలెంట్ ఉన్నా సరే దానికి తగ్గ రెమ్యూనరేషన్ ఇవ్వరని ఇప్పటికీ ఆ డైరెక్టర్ అన్న మాటలు తనను వెంటాడుతూనే ఉంటాయని, ఆయన మాటలు తనలో కసిని పెంచాయని, ఎలాగైనా అంత సంపాదించాలని అప్పుడే డిసైడ్ అయ్యానని తిలోత్తమ తెలిపింది. అదృష్టం కొద్దీ తర్వాత తనకో సినిమా ఆఫర్ వచ్చిందని దాని కోసం తాను అడిగినంత ఇవ్వాలని కండిషన్ పెట్టానని, అయితే తాను అనుకున్న దానికంటే డబుల్ రెమ్యూనరేషన్ వాళ్లు ఇచ్చారని చెప్తూ తిలోత్తమ ఏడ్చేసింది. తిలోత్తమ ఇప్పటికే ది నైట్ మేనేజర్, ఢిల్లీ క్రైమ్, లస్ట్ స్టోరీస్2, పాతాళ్ లోక్2, సర్, మాన్‌సూన్ వెడ్డింగ్ లాంటి సినిమాలతో ఆడియన్స్ కు దగ్గరైన విషయం తెలిసిందే.
