Begin typing your search above and press return to search.

టిల్లు క్యూబ్.. అంతకుమించే..

అయితే టిల్లు క్యూబ్ సినిమా కోసం సీనియర్ బ్యూటీలను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమన్న, సమంత లాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపించాయి.

By:  Tupaki Desk   |   10 April 2024 12:40 PM GMT
టిల్లు క్యూబ్.. అంతకుమించే..
X

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ సక్సెస్ అయితే అందుకున్నాడు. టిల్లు క్యారెక్టర్ తో అతనికి ఇప్పుడు అందుకున్న క్రేజ్ మామూలుగా లేదు. మొదట ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అదే క్యారెక్టర్ ను మళ్ళీ కొనసాగింపుగా సిద్దు జొన్నలగడ్డ మరో కథను రాసుకున్నాడు.

ఇక దర్శకుడు మారినా సినిమాలో ఎంటర్టైన్మెంట్స్ లో ఏ మాత్రం మార్పు లేకుండా వెండితెరపైకి తీసుకువచ్చారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ప్రస్తుతం అతని లైనప్ లో ఉన్న సినిమాల బిజినెస్ కూడా హై రేంజ్ లోనే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక సీతార ఎంటర్టైన్మెంట్స్ లో టిల్లు క్యారెక్టర్ తో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని ఇదివరకే సిద్దు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా టిల్లుని ఒక సూపర్ హీరో తరహాలో కూడా ప్రజెంట్ చేసే ఆలోచన ఉంది అని చెప్పడం మరింత ఆసక్తిని కలిగించింది. ఇక త్వరలో టిల్లు క్యూబ్ ఉంటుంది అని సెకండ్ పార్ట్ చివరలో ఒక ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే హీరోయిన్స్ విషయంలో కొంత మార్పు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టిని తీసుకున్నారు. తర్వాత టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ ను హైలెట్ చేశారు. రెండు సినిమాల్లో కూడా హీరోయిన్స్ వారి గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనుపమ ఊహించిన విధంగా లిప్ లాక్ సన్నివేశాలలో కూడా కనిపించడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే టిల్లు క్యూబ్ సినిమా కోసం సీనియర్ బ్యూటీలను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమన్న, సమంత లాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ తప్పకుండా ఒక స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సితార మరింత ఎక్కువ స్థాయిలో ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే మీనాక్షి చౌదరిని టిల్లు స్క్వేర్ లో ఎలాగైతే గెస్ట్ పాత్రలో హైలెట్ చేశారో, ఇప్పుడు టిల్లు క్యూబ్ లో ఆమెతోపాటు అనుపమను కూడా ప్రత్యేకమైన పాత్రలతో చూపించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈసారి విదేశాల్లో టిల్లు గాడి అల్లరి మొదలయ్యే అవకాశం ఉందట. అంటే పూర్తిస్థాయిలో ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో కథను రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.