Begin typing your search above and press return to search.

టిల్లు క్యూబ్.. మామూలు చాలెంజ్ కాదు

ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా సినిమాలు రెండు భాగాలుగానే రిలీజ్ అయ్యాయి. మూడో భాగం రాలేదు. కాబట్టి మేకర్స్ కు ఇది పెద్ద చాలెంజ్.

By:  Tupaki Desk   |   31 March 2024 8:55 AM GMT
టిల్లు క్యూబ్.. మామూలు చాలెంజ్ కాదు
X

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వరుసగా రెండు బిగ్ హిట్స్ చూశాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటెర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలు యూత్ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలో టిల్లు డైలాగ్స్ కు సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రాధిక, లిల్లీ లాంటి అమ్మాయిలు ప్రతి కుర్రాడి లైఫ్ లో కచ్చితంగా కనిపిస్తారు అనే లైన్ తోనే సినిమా బాగా కనెక్ట్ అవుతోంది.

రియల్ లైఫ్ కి దగ్గరగా ఈ కథలు ఉండటంతో విశేషమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. హాలీవుడ్ సినిమా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్ పోటీలో ఉన్న కూడా టిల్లు స్క్వేర్ కి తెలుగు రాష్ట్రాలలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. డీజే టిల్లు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్లు కలెక్ట్ చేసింది. టిల్లు స్క్వేర్ దీనికి రెట్టింపు కలెక్షన్స్ సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది. ఇదిలా ఉంటే టిల్లు సిరీస్ లో కొనసాగింపుగా టిల్లు క్యూబ్ రానుందని టిల్లు స్క్వేర్ మూవీ ఎండ్ కార్డు లో స్పష్టత ఇచ్చారు.

2025లో రిలీజ్ టార్గెట్ గా మూవీని సిద్ధం చేయనున్నారంట. అయితే ఈ టిల్లు సిరీస్ లో భాగంగా రాబోయే మూడో సినిమాకి ఎలాంటి కథ ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అయితే ఇప్పటికే పార్ట్ 3 కోసం ఒక స్టోరీ లైన్ కూడా అనుకున్నారంట. త్వరలో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా సినిమాలు రెండు భాగాలుగానే రిలీజ్ అయ్యాయి. మూడో భాగం రాలేదు. కాబట్టి మేకర్స్ కు ఇది పెద్ద చాలెంజ్.

హిందీ పరిశ్రమలో హౌస్ ఫుల్ 5 రెడీ అవుతోంది. గోల్ మాల్ 3, టైగర్ 3, ఫక్రే 3, సింగం 3 లాంటి సినిమాలు సిరీస్ లుగా కొనసాగుతున్నాయి. క్రిష్, ధూమ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. తెలుగులో టిల్లు తోనే ఈ కల్చర్ మొదలైనట్లు కనిపిస్తోంది. టిల్లు సిరీస్ లో పార్ట్ 3 కన్ఫర్మ్ కాగా సోగ్గాడే చిన్ని నాయనా సిరీస్ లో పార్ట్ 3 రాబోతుందని టాక్ వినిపిస్తోంది అలాగే కార్తికేయ సిరీస్ కూడా కొనసాగుతోంది. టిల్లు సిరీస్ లో మొదటి రెండు పార్ట్ లు రాధిక, లిల్లీలతో నడిపించేశారు.

కథ పెద్దగా లేకపోయిన ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. అయితే మూడో పార్ట్ విషయంలో మాత్రం కచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ లైన్స్ నుంచి బయటకి రావాలి. కొత్త పాయింట్ తో కథ చెప్పాలి. మూడో పార్ట్ కి హీరోయిన్ ఎంపిక కూడా చాలా కీలకం కానుంది. నేహా శెట్టి, అనుపమ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ తో పాటుగా బోల్డ్ అండ్ రొమాంటిక్ సీక్వెన్స్ చేసే బ్యూటీని దించాలి. దర్శకుడి విషయంలో రెండు భాగాలకి ఇద్దరిని పెట్టుకున్నారు. మూడో పార్ట్ కి ఎవరుంటారు అనేది తెలియాల్సి ఉంది.