Begin typing your search above and press return to search.

మాళ‌విక సూప‌ర్ హాట్ షో ఇది!

ఇదిగో ఇక్క‌డిలా మాళ‌విక‌ హాట్ షోకి ఫిదా కానిది ఎవ‌రు అంటూ ఛాలెంజ్ విసిరింది.

By:  Tupaki Desk   |   18 Jan 2024 4:56 PM GMT
మాళ‌విక సూప‌ర్ హాట్ షో ఇది!
X

ముంబై బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్ టాలీవుడ్ లో ఇంకా లాంచ్ అవ్వ‌లేదు. కానీ అమ్మ‌డు ఇన్ స్టా అభిమా నులు బాగా సుప‌రిచితురాలే. ఎప్ప‌టిక‌ప్పుడు సెగ‌లు పుట్టించే ఫోటోల‌తో కుర్రాళ్ల‌ని ఆక‌ర్షిస్తుంది. నాలో వేడిని చూడండి అంటూ మ‌త్తెక్కించే భంగిమ‌ల‌తో క‌నిక‌ట్టు చేసేస్తుంది. తాజాగా మ‌రో హాట్ ఫోటోతో నెట్టింట ర‌చ్చ షురూ చేసింది. ఇదిగో ఇక్క‌డిలా మాళ‌విక‌ హాట్ షోకి ఫిదా కానిది ఎవ‌రు అంటూ ఛాలెంజ్ విసిరింది. జీన్స్ ప్యాంట్ మ్యాచింగ్ జీన్స్ పేరుకు మాత్ర‌మే ధ‌రించింది. అందాల ఆర‌బోత‌లో నన్ను బీట్ చేసేది? ఎవ‌రు అంటూ చెల‌రేగింది.


టాప్ టూ హిప్ వ‌ర‌కూ మాళ‌విక అందాల్లో చిత్తు అవ్వాల్సిందే అన్న రేంజ్ లో చెల‌రేగింది. లో దుస్తుల్లో అమ్మ‌డు చెమ‌ట‌లు ప‌ట్టించేస్తుంది. వేసుకున్న ష‌ర్ట్ ని అలా జెబ్బ‌ల కింద‌కు జార విడిచి బ్యూటీని క్యాప్చ‌ర్ చేయండి అంటూ ఇలా వ‌దిలేసింది. నాభి అందాల్లో సైతం నాకెవ్వ‌రు సాటి అనిపించింది.


లో దుస్తులు మ్యాచింగ్ మెన్స్ వాచ్ ధ‌రించింది. కెమెరా కి ఇచ్చిన భంగిమ అంత‌కు మించి సెన్షేష‌న్. మొత్తంగా టాప్ టూ బాట‌మ్ మాళ‌విక అంటే మంట‌లు పుట్టాల్సిందే అనిపించింది.


ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. దీంతో ఫాలోవ‌ర్స్ ఎవ‌రి స్టైల్లో వారు చెల‌రేగుతున్నారు. టాలీవుడ్ లో డెబ్యూ కి ముందే సొగ‌స‌రి ఈ ర‌కంగా తెలుగింట ఫేమ‌స్ అయిపోతుంది. సినిమాలు చేసి స‌క్సెస్ అయితే ఫాలోయింగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహ‌కే అంద‌దు. ఈ బ్యూటీ తొలుత మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటుపై క‌న్న‌డ‌..హిందీలోనూ సినిమాలు చేసింది. అయితే పేరొచ్చింది మాత్రం కోలీవుడ్ చిత్రాల‌తోనే.


తొలుత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `పేట` లో ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత విజయ్ న‌టించిన `మాస్టర్` మూవీలో విభిన్న పాత్రలో క‌నిపించింది. కానీ రెండు సినిమాలు అమ్మ‌డికి అనుకున్నంత గుర్తిం పును తీసుకురాలేదు. స్టార్ హీరోల చిత్రాల్లో భాగ‌మైంది అన్న ఇమేజ్ త‌ప్ప స‌క్సెస్ ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం చియాన్ విక్ర‌మ్ స‌ర‌స‌న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `తంగ‌లాన్` లో న‌టిస్తోంది. ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.