Begin typing your search above and press return to search.

'దేవర' కి ఇప్పటి నుంచే అవసరం లేదు..!

దాంతో మే ఏప్రిల్‌ లో విడుదల చేయాలని భావించిన సినిమాను అక్టోబర్‌ కి వాయిదా వేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   25 April 2024 4:37 AM GMT
దేవర కి ఇప్పటి నుంచే అవసరం లేదు..!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. దాంతో మే ఏప్రిల్‌ లో విడుదల చేయాలని భావించిన సినిమాను అక్టోబర్‌ కి వాయిదా వేయడం జరిగింది.

ప్రస్తుతం వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ త్వరలో మళ్లీ దేవర సినిమా షూట్‌ లో పాల్గొంటాడు. దేవర సినిమా విడుదలకు దాదాపుగా ఆరు నెలల సమయం ఉంది. కనుక ఇప్పటి నుంచే ప్రమోషన్‌ అక్కర్లేదు అనేది కొందరి అభిప్రాయం. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం పాటలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల పాటలను సినిమా విడుదలకు నెలల ముందే విడుదల చేస్తున్నారు. కనుక దేవర సినిమా పాటల సందడి కూడా మొదలు పెట్టాలని ఫ్యాన్స్‌ లో కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కొరటాల శివ మాత్రం ప్రస్తుతానికి ఆ ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది.

జూన్‌ జులై వరకు పూర్తిగా షూటింగ్‌ పైనే దర్శకుడు దృష్టి పెట్టబోతున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై లో దేవర మొదటి సాంగ్ ను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. అందుకే సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచంద్రన్‌ చాలా స్లోగా దేవర పాటలను ట్యూన్‌ చేస్తున్నారట.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ ను చేయించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నుంచి రాబోతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.