సత్తా చాటుతున్న తెలుగమ్మాయిలు.. వారికి చెక్ పెట్టనున్నారా?
సాధారణంగా సొంత ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే పక్క భాషా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.
By: Tupaki Desk | 18 Feb 2026 2:01 PM ISTసాధారణంగా సొంత ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే పక్క భాషా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇక మిగతా భాషల హీరోయిన్స్ గురించి కాస్త పక్కన పెడితే..ముఖ్యంగా తెలుగు హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగమ్మాయిలు డిమాండ్ చేస్తారని దర్శక నిర్మాతలు కామెంట్లు చేస్తుంటే.. అసలు తెలుగమ్మాయిలకు అవకాశాలే ఇవ్వడం లేదని మరికొంతమంది తమ అభిప్రాయాలుగా చెప్పుకొస్తున్నారు. కానీ కంటెంట్ మనలో ఉంటే తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా ప్రజలు ఆదరిస్తారు అని నిరూపిస్తున్నారు ఈమధ్యకాలపు యువ హీరోయిన్లు.
నిజానికి తెలుగమ్మాయిలు గ్లామర్ షో చేయడానికి వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల హీరోయిన్లు తెలుగులో సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సహజ నటనతో పాపులారిటీ దక్కించుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఒకవైపు తమ అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూనే.. మరొకవైపు గ్లామర్ షో చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పేరు దక్కించుకుంది.'ఓ బేబీ' సినిమాతో ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీ అయిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీల చేత తెలుగమ్మాయిలు సత్తా చాటుతున్నారు.. ఇక వైష్ణవి ని చూసి తెలుగు ఇండస్ట్రీలోకి అమ్మాయిలు వస్తారు అని అనిపించేలా చేసింది .
ఆ తర్వాత వచ్చిన అమ్మాయి శివాని నాగారం.'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శివాని 'లిటిల్ హార్ట్స్ ' సినిమాతో ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీ అయిపోయింది. అమాయకత్వపు నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం 'హే భగవాన్' అంటూ మరోసారి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడానికి సిద్ధమయ్యింది ఈ వయ్యారి.
ఇకపోతే తమ నటనతో పాటు గ్లామర్ తో కూడా పిచ్చెక్కించేస్తోంది మరో తెలుగు అమ్మాయి మానస వారణాసి. పక్కా హైదరాబాదీ అయిన ఈమె చిన్నప్పుడు ఇక్కడే చదువుకుంది . కానీ తన తండ్రి ఉద్యోగరీత్యా మలేషియా వెళ్ళిపోయింది.అక్కడే పదవ తరగతి వరకు చదువుకున్న ఈమె మళ్లీ హైదరాబాద్ కి వచ్చి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకుంది. ఆ సమయంలో మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈమె.. 2020లో మిస్ తెలంగాణగా నిలిచి , అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా, మిస్ ఇండియా వరల్డ్ కిరాటాలు కూడా సొంతం చేసుకుంది. అలాంటి ఈమె తాజాగా 'కపుల్ ఫ్రెండ్లీ' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న మానస వారణాసి.. ఈ సినిమాతో తన నటనను నిరూపించింది.
అంతేకాదు ఈ ఒక్క సినిమాతో ట్రెండింగ్ లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. అలా ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా తమ నటనతో ఒకరి తర్వాత ఒకరు సత్తా చాటుతూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అటు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న పక్క రాష్ట్రాల హీరోయిన్లు అనగా రుక్మిణి వసంత్, అనుపమ పరమేశ్వరన్, ఖయాదూ లోహర్, మమితాబైజు ఇలా కొంతమంది హీరోయిన్లకు చెక్ పెడుతూ టాలీవుడ్ లోనే అవకాశాలు అందుకుంటూ దక్షిణాదిలో తమ కంటూ ఒక గుర్తింపును దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీరిని బట్టి చూస్తుంటే ఇప్పటికైనా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అనే పాత పదాన్ని పక్కన పెట్టాలి అని.. టాలెంట్ ఉంటే తెలుగు పరిశ్రమ కచ్చితంగా ఆదరిస్తుంది అని నిరూపిస్తున్నారు. ఇక మునుముందు ఇండస్ట్రీలోకి రావాలనుకునే అమ్మాయిలకు వీరు రోల్ మోడల్ అని కూడా చెప్పవచ్చు.
