Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం.. ఈ ఇద్దరిలో ఒకరు?

ఇక ఈ చిత్రంలో తారక్ కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 March 2024 4:33 AM GMT
ఎన్టీఆర్ కోసం.. ఈ ఇద్దరిలో ఒకరు?
X

జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ కంప్లీట్ చేసుకొని బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. వార్ కి సీక్వెల్ గా ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న వార్ 2 నెక్స్ట్ షూటింగ్ కోసం రెడీ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు గతంలో హృతిక్ రోషన్ క్లారిటీ ఇచ్చారు. దేవర మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేయడంతో వార్ 2 కోసం తారక్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. అన్ని కరెక్ట్ గా కుదిరితే ఏప్రిల్ నెలలో వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఇక ఈ చిత్రంలో తారక్ కి జోడీగా ఇద్దరు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కియారా అద్వానీ పేరు మొన్నటి వరకు వినిపించింది. అయితే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు హీరోయిన్స్ కి సౌత్ లో మంచి ఇమేజ్ ఉంది. సౌత్ సినిమాలతో సత్తా చాటుతున్నారు. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ కి సీతారామం, హాయ్ నాన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.

కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. అలాగే హిందీలో డాన్ 3లో కథానాయికగా ఖరారు అయ్యింది. ఒకవేళ వార్ 2 సినిమాలో కియారా అద్వానీని తీసుకుంటే కచ్చితంగా వారిద్దరి జోడీ బెస్ట్ పెయిర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో తారక్ కనిపించబోతున్నాడు.

క్యారెక్టర్ కాస్తా నెగిటివ్ టచ్ తోనే ఉండబోతోందని టాక్. అలాగే వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ లో సోలోగా తారక్ లీడ్ రోల్ లో ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ తెరకెక్కించనున్నారని ప్రచారం నడుస్తోంది. దేవర మూవీ హిట్ అయితే తారక్ ఇమేజ్ కూడా అమాంతంమారిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ వార్ 2 మీద కూడా అంచనాలు పెరుగుతాయి. ఆ సినిమాలో తారక్ పెర్ఫార్మెన్స్ బట్టి ఇండియన్ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఎన్టీఆర్ లైనప్ లో ఈ రెండు సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా ఉంది. ప్రస్తుతం నీల్ సలార్ తో బిజీగా ఉన్నాడు. దాని తరువాత ఎన్టీఆర్ ప్రాజెక్టుపై అతను ఫోకస్ చేయనున్నాడు.